Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 May 2024 09:14 IST

1. మద్యం మహమ్మారికి ‘జగన్‌ ముద్దులు’

మంచివాడిలా నటించడం, నమ్మించి నట్టేట్లో ముంచడం, ఏమీ ఎరగనట్టు మళ్లీ సుద్దపూస మాటలు చెప్పడం... ఇవి జగన్‌ సహజ లక్షణాలు. ‘‘ప్రజలతో విచ్చలవిడిగా తాగించి ఆదాయం పెంచుకోవాలనే ప్రభుత్వ ఆలోచన దారుణంగా ఉంది’’ అంటూ ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పిన నీతులు- సుమతీ శతకకర్త కూడా చెప్పలేదు. అలా జనాన్ని ఏమార్చి ఓట్లు వేయించుకున్న ఆయన- సీఎం అయ్యాక పరమ అనైతికంగా మాట్లాడారు. పూర్తి కథనం

2. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్‌ ప్రాంతంలోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. గాంధీనగర్‌ నుంచి బరిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆ సమయంలో ప్రధానితో పాటే ఉన్నారు.పూర్తి కథనం

3. 2024.. అత్యంత వేడి సంవత్సరం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్‌ ట్రెండ్స్‌’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ముందస్తు రుతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్‌ నెలలో.. భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తరువాత ఐదో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. పూర్తి కథనం

4. దావత్‌ కావాలా నాయనా!

ఎన్నికల పండుగొచ్చింది.. దావత్‌ల మీద దావత్‌లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువతకు ఇష్టమైన విందులతో జిల్లాలోని ఫాంహౌజ్‌లు రద్దీగా ఉంటున్నాయి.పూర్తి కథనం

5. రాజోలి అన్నావ్‌.. జోలాలి పాడావ్‌!

మాట తప్పను..మడమ తిప్పను అని సీఎం జగన్‌ తరచూ అంటుంటారు. రాజోలి ఆనకట్ట విషయంలో ఆయన మాట తప్పారు, మడమ తిప్పారు... రైతుల ప్రయోజనాలకు గండి కొట్టారు. సీఎం జగన్‌ మన జిల్లా వాసే కదా ఆయన ఏదైనా శంకుస్థాపన చేస్తే అమలవుతుందని మొదట్లో ప్రజలు నమ్మారు. పూర్తి కథనం

6. హైదరాబాద్‌లో ఆ ఏడు ప్రాంతాలు హీట్‌ ఐలాండ్లు

చెట్ల నరికివేత, పట్టణీకరణతో నగరం కాంక్రీటు వనంలా మారి నిప్పు కుంపటిని తలపిస్తోందని హైదరాబాద్‌ అర్బన్‌ ల్యాబ్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన పరిశోధన నివేదిక స్పష్టం చేస్తోంది. మార్చిలో నగరవ్యాప్తంగా 7 ప్రాంతాల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైనట్లు తెలుపుతూ.. వాటిని అర్బన్‌ హీట్‌ ఐలాండ్స్‌గా పేర్కొంది.పూర్తి కథనం

7. ఐదేళ్లు కట్టలేక పోయారు

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని సీఎం జగన్‌మోహనరెడ్డి నెరవేర్చలేదు. దీంతో ఏటా నదీ తీరప్రాంత వాసులకు ముంపు ముప్పు తప్పని పరిస్థితి. పూర్తి కథనం

8. కొడాలికి ‘కోడ్‌’ వర్తించదా?

కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఎన్నికల ప్రచారంలో కోడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన.. నామినేషన్‌ వేసే రోజే అధికారులు అనుమతించిన మార్గంలో కాకుండా తనకు నచ్చినట్లు వైకాపా శ్రేణులను మళ్లిస్తూ వెళ్లారు. తాజాగా గుడివాడ మండలం మోటూరులో ఆదివారం ప్రచారానికి వెళ్లిన నాని.. తన అనుచరులతో కలిసి వంగవీటి మోహనరంగా విగ్రహానికి ముసుగు తొలగించి మరీ పూలదండలు వేశారు.పూర్తి కథనం

9. ఆ నాలుగు పార్టీలు నా గెలుపును అడ్డుకోలేవు

పాతబస్తీలో నివసిస్తున్న ముస్లింలకు తామే రక్షకులమంటూ మజ్లిస్‌ పార్టీ చెప్పుకుంటోంది. వాస్తవానికి ఇక్కడ వెనుకబాటుతనానికి వారే కారణం. ముస్లింల పేర్లు చెప్పుకొని పాతబస్తీలో భూ కబ్జాలు చేస్తున్నారు. చివరికి శ్మశానాలూ వదల్లేదు. ఐదు దశాబ్దాల నుంచి పాతబస్తీలో వేళ్లూనుకున్న ఎంఐఎం పార్టీని ఇంటికి పంపించేస్తా’ అని హైదరాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలత అన్నారు.పూర్తి కథనం

10. వైకాపాను గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా!

‘వైకాపాకు ఓటేయొద్దంటూ ఎంత చెప్పినా అప్పట్లో మీరు వినలేదు. ఇప్పుడు ఈ పాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగింది’ అంటూ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు టీవీ రామారావు చెప్పుతో కొట్టుకుని ఎస్సీల తరఫున పశ్చాత్తాపం ప్రకటించారు. సోమవారం గొడారిగుంటలోని తన కార్యాలయంలో కొందరు ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆయనను కలిసి కూటమికి మద్దతు ప్రకటించారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని