చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం.

Updated : 07 May 2024 09:12 IST

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. ఈ తరుణంలో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి మంచిర్యాల జిల్లా నస్పూర్‌ కాలనీకి చెందిన దివ్యాంగుడు గోళ్ల శంకరయ్య వినూత్నయత్నం చేశారు. ఎండ, వేడిగాలులు తగలకుండా తన ద్విచక్ర వాహనానికి గ్రీన్‌ మ్యాట్‌ ఏర్పాటు చేసుకొని ఇరువైపులా మనీప్లాంట్‌ నాలుగు మొక్కలను పెంచుతున్నారు. దీంతో ఎంత ఎండలో ప్రయాణించినా చల్లగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని