కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 03 Sep 2022 00:18 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


పొడుపు కథలు

1. రెక్కలు ఆడించకుండానే దేశదేశాలూ తిరిగొస్తుంది. ఏమిటా పక్షి?
2. తినే వేళకు వస్తుంది. తిన్నాక గోడకు ఒరుగుతుంది. ఏంటది?
3. సముద్రంలో పుట్టింది. సముద్రంలోనే పెరిగింది. ఊళ్లోకొచ్చి ఉరుముతుంది. అదేంటి?  
4. వెనక్కిపోతే గెలుపు. ముందుకొస్తే ఓటమి. ఏంటా ఆట?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1.  వజ్రాల్లో ఆకుపచ్చ రంగువి అత్యంత అరుదు.
2. ఇసుక అస్సలే కరగదు.

3. ఒలింపిక్స్‌ లోగోలో నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులు ఉంటాయి.
4. ఆంగ్లంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉపయోగించే అక్షరాలు
A, E, O, T.

5. ఇంద్రధనుస్సులో తెలుపు రంగు ఉంటుంది.
6. సెయిలింగ్‌లో ఉపయోగించే తాడును ‘హల్‌యార్డ్‌’ అంటారు.


నేనెవర్ని?

అయిదక్షరాల పదాన్ని నేను. ‘ఏరు’లో ఉంటాను కానీ ‘గోరు’లో లేను. ‘కలం’లో ఉంటాను కానీ ‘హలం’లో లేను. ‘దండ’లో ఉంటాను కానీ ‘అండ’లో లేను. ‘తుక్కు’లో ఉంటాను కానీ ‘ఉక్కు’లో లేను. ‘కీడు’లో ఉంటాను కానీ ‘కీలు’లో లేను. ఇంతకీ నేనెవర్ని?





జవాబులు:

బొమ్మల్లో ఏముందో? : 1.బంతిపూల దండలు 2.తిమింగలం 3.లంగాఓణీ 4.గారెలు 5.తోడేలు 6.తోట

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు (3000 ఫారన్‌హీట్‌ డిగ్రీల వద్ద కరుగుతుంది) 3.అవును 4.అవును 5.కాదు (ఉండదు) 6.అవును

పొడుపు కథలు : 1.విమానం 2.కంచం 3.శంఖం 4.తాడాట (టగ్‌ ఆఫ్‌ వార్‌)

కవలలేవి? : 2, 3

నేనెవర్ని? : ఏకదంతుడు

అక్షరాల చెట్టు : JUSTIFICATION



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని