అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 23 Nov 2022 00:17 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


క్విజ్‌.. క్విజ్‌.!

1.  గంగా నది ఏ సముద్రంలో కలుస్తుంది?
2. ఎవరి పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకొంటాం?
3. ఇప్పటివరకూ భారత్‌ ఎన్ని వన్డే క్రికెట్‌ ప్రపంచ కప్‌లు గెలుచుకుంది?
4. గుజరాత్‌లోని గిర్‌ నేషనల్‌ పార్క్‌ ఏ జంతువులకు ప్రసిద్ధి?
5. మానవ శరీరంలో అత్యంత సున్నితమైన అవయవం ఏది?


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘కత్తి’లో ఉంటాను కానీ ‘సుత్తి’లో లేను. ‘లక్ష్యం’లో ఉంటాను కానీ ‘సాక్ష్యం’లో లేను. ‘హంస’లో ఉంటాను కానీ ‘హింస’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘విల్లు’లో ఉంటాను కానీ ‘హల్లు’లో లేను. ‘గిత్త’లో ఉంటాను కానీ ‘గిరి’లో లేను. ‘నామం’లో ఉంటాను కానీ ‘క్షామం’లో లేను. ‘రైలు’లో ఉంటాను కానీ ‘రైతు’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


వాక్యాల్లో ప్రాంతాల పేర్లు

కింది వాక్యాల్లో కొన్ని ప్రాంతాల పేర్లు దాగున్నాయి. అవేంటో కనుక్కోండి చూద్దాం.
1. చివరికది రిమోట్‌గా కూడా పనికిరాకుండా పోయింది.
2. నరసింహా.. చలం ఇంటికి వెళ్లి, ఈ పుస్తకం ఇచ్చిరా..

3. నిలకడ, పట్టుదల ఉంటేనే.. ఏ రంగంలోనైనా రాణించగలం.
4. వాళ్లందరూ కలిసిమెలిసి బాగుంటూ.. రుబాబు చేయడం నాకు నచ్చలేదు.

5. బురదలో పసికందు కూరుకుపోవడం చూస్తే.. చాలా బాధగా అనిపించింది.
6. నెమలి పురి విప్పి నాట్యం ఆడుతుంటే.. ఎంత మనోహరంగా ఉంటుందో.!





జవాబులు:

పట్టికల్లో పదం!: అనుమానితుడు

రాయగలరా?: 1.కొబ్బరి తురుము 2.ఇసుక తుపాను 3.కొండచిలువ 4.రిక్తహస్తం 5.పిండిమర 6.అడవిపంది 7.తెరచాప 8.అరటితొక్క 9.మర్రిచెట్టు 10.పాదయాత్ర 11.ఖడ్గమృగం 12.కంచర గాడిద 13.పాపభీతి 14.చెరకురసం 15.విశాఖపట్నం

క్విజ్‌.. క్విజ్‌..! : 1.బంగాళాఖాతం 2.జవహర్‌లాల్‌ నెహ్రూ 3.రెండు 4.సింహాలు 5.చర్మం

అది ఏది? : 3

అక్షరాల చెట్టు : CONSCIOUSNESS

నేనెవర్ని? : 1.కలహం 2.విత్తనాలు

వాక్యాల్లో ప్రాంతాల పేర్లు : 1.కదిరి 2.సింహాచలం 3.కడప 4.గుంటూరు 5.కందుకూరు 6.నెమలి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని