తేడాలు కనుక్కోండి?

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 20 Dec 2023 00:02 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పదవలయం

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘వ’ అక్షరంతోనే మొదలవుతాయి.

1.వర్షాకాలంలో నదులకు వచ్చేది 2.వృత్తం 3.చలికి వస్తుంది 4.ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది 5.మొదలైన.... మరోలా 6.విడిచిపెట్టు.. 8.క్రమపద్ధతి 9.స్త్రీని ఇలా కూడా అంటారు


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


గజిబిజి బిజిగజి!

కింద కొన్ని పదాలు గజిబిజిగా వాటిని సరిజేసి రాయండి చూద్దాం.



నేనెవర్ని?

నేనో మూడక్షరాల పదాన్ని. ‘వినతి’లో ఉంటాను. ‘ఆనతి’లో ఉండను. ‘ఉష’లో ఉంటాను. ‘ఉలి’లో ఉండను. ‘మాయం’లో ఉంటాను. ‘మాయ’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?


అవునా.. కాదా..!

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పగలరా?
1. విస్తీర్ణం పరంగా రష్యా అతి చిన్న దేశం.
2. మొట్టమొదటి సారిగా అంతరిక్షంలోకి వెళ్లిన జీవి డాల్ఫిన్‌.
3. అశోకుడికే అలెగ్జాండర్‌ అనే మరో పేరు ఉండేది.
4. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది.  
5. కింగ్‌ఫిషర్‌ అనేది నిజానికి పక్షి కాదు.
6. మాస్టర్‌ బ్లాస్టర్‌ అని రోహిత్‌ శర్మను అంటుంటారు.  
7. కంగారూల పుట్టినిల్లు అని ఆస్ట్రేలియాకు పేరు.
8. కివీ పేరుతో పండు, పక్షి ఉన్నాయి.


తమాషా ప్రశ్నలు?

1. సంపదలను ఇచ్చే బడి?
2. మొక్కకు పూయని రోజాలు?
3. రక్షణ ఇచ్చే కారం?
4. తాజ్‌మహల్‌ ఎక్కడుంది?
5. అన్నం తినకపోతే ఏమవుతుంది?


జవాబులు

తేడాలు కనుక్కోండి?: ఎలుగు కాలు, ఏనుగు చెవి, కాకి స్థానం, తోడేలు చెవి, నక్క నోరు, జంట చెట్లు

రాయగలరా??: 1.కర్మఫలం 2.అనుభవం 3.ఉపగ్రహం 4.సమయస్ఫూర్తి 5.పురస్కారం 6.పరిశోధన 7.గాలిపటం 8.నీటి ఆవిరి 9.పెనుముప్పు 10.యజమాని 11.తోటమాలి 12.వేలంపాట 13.ఉపవాసం 14.పిట్టగోడ 15.వ్యతిరేకం

పదవలయం: 1.వరద 2.వలయం 3.వణుకు 4.వయసు 5.వగైరా 6.వదులు 7.వరస 8.వనిత

అవునా.. కాదా...!: 1.కాదు 2.కాదు 3.కాదు 4.అవును 5.కాదు 6.కాదు 7.అవును 8.అవును

నేనెవర్ని?: విషయం

గజిబిజి బిజిగజి!: 1.ఆటబొమ్మలు 2.చెరకుగడ 3.పరుగుపందెం 4.కొండముచ్చు 5.రంగస్థలం 6.కార్యాలయం 7.కొబ్బరికాయ 8.చెరువుగట్టు

తమాషా ప్రశ్నలు?: 1.రాబడి 2.శిరోజాలు 3.ప్రాకారం 4.కట్టినచోటే 5.మిగిలిపోతుంది


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని