Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 05 May 2024 12:58 IST

1. ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై ఈసీ బదిలీ వేటు

అమరావతి: ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై బదిలీ వేటు వేశారు. వారిపై అందిన ఫిర్యాదులపై మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్‌ బాషాను ఈసీ బదిలీ చేసింది. పూర్తి కథనం

2. ‘ఆఫ్టర్‌ 9’ పబ్‌పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బంజారాహిల్స్ రోడ్డు నంబర్‌ 14లోని ‘ఆఫ్టర్ నైన్‌’ పబ్‌పై శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత పబ్‌ కొనసాగుతోందని.. అందుకే దాడులు చేసినట్లు వెల్లడించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని తెలిపారు.పూర్తి కథనం

3. మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: హరీశ్‌రావు

భారాస ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చినట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు ద్వారా 11 విడతల్లో రైతులకు రూ.72 వేల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు.పూర్తి కథనం

4. బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత

భారీ వర్షాల ధాటికి బ్రెజిల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. దేశ దక్షిణ ప్రాంతంలోని రియో గ్రాండ్ డి సుల్‌ రాష్ట్రం అతలాకుతలమైంది. దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది వరకు గల్లంతయ్యారు. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు.పూర్తి కథనం

5. నిజ్జర్‌ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో

కెనడా చట్టబద్ధమైన పాలన ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) అన్నారు. తమ దేశం స్వతంత్ర, బలమైన న్యాయవ్యవస్థ కలిగి ఉందన్నారు. తమ పౌరులను రక్షించడమే ప్రభుత్వ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు వ్యవహారంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.పూర్తి కథనం

6. గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్

ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్‌ను నడిపిస్తున్న తమ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌పై (Shumban Gill) స్టార్‌ ఆటగాడు డేవిడ్ మిల్లర్ ప్రశంసలు కురిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును అద్భుతంగా నడిపించే సత్తా అతడికి ఉందని వ్యాఖ్యానించాడు. బెంగళూరుతో మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మిల్లర్ మాట్లాడాడు. ప్రస్తుత సీజన్‌లో తమ జట్టు ప్రదర్శన గొప్పగా లేదని.. చాలా మ్యాచుల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలవడం నిరాశకు గురి చేసిందని తెలిపాడు. పూర్తి కథనం

7. మంగళగిరిలో వాకర్లతో నారా బ్రాహ్మణి మాటామంతీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి (Nara Brahmani) మంగళగిరిలో పర్యటించారు. ఎకో పార్కులో వాకర్స్‌తో కలిసి బ్రాహ్మణి వాకింగ్‌ చేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎకో పార్కును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కృష్ణా నది సమీపంలో మత్య్సకారులతో నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పూర్తి కథనం

8. ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టాం: కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌ హయాంలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతి రహిత ప్రభుత్వం రావాలని ప్రజలు 2014లో మోదీకి ఓటేశారని చెప్పారు. ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవన్నారు. పూర్తి కథనం

9. పులివెందులలో జగన్‌ ఓటమి తథ్యం: తులసిరెడ్డి

పులివెందుల నియోజకవర్గంలో జగన్‌మోహన్‌రెడ్డి ఓటమి తథ్యమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తులసిరెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలకు జగన్‌ దూరమయ్యారని, ఆయన పాలనలో పులివెందుల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. ‘జగన్‌ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. మద్యం ఏరులై పారుతోంది. ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. రోడ్లు అధ్వానంగా మారాయి. డ్రిప్‌ ఇరిగేషన్‌ మూలన పడింది’ అని తులసిరెడ్డి మండిపడ్డారు.పూర్తి కథనం

10. ఆ రాష్ట్రంలో లోక్‌సభ బరిలో 12 మంది ఎమ్మెల్యేలు.. గెలిస్తే మరోసారి ఎన్నికలు

పంజాబ్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగియగానే.. మరోసారి ఎన్నికల సమరం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడమే ఇందుకు కారణం. ఆ రాష్ట్రంలో 12 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరు విజయం సాధిస్తే.. ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి. రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు లోక్‌సభకు పోటీచేస్తుండటం గతంలో ఎన్నడూ చూడలేదని విశ్లేషకులు అంటున్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని