కరకర పాప్‌కార్న్‌తో సరదాగా..

మనందరికీ పాప్‌కార్న్‌ అంటే చాలా ఇష్టం కదా! దీంతోనూ కొన్ని చిత్రాలు తయారు...

Published : 07 Jan 2020 00:14 IST

మనందరికీ పాప్‌కార్న్‌ అంటే చాలా ఇష్టం కదా! దీంతోనూ కొన్ని చిత్రాలు తయారు చేయొచ్ఛు అవేంటో సరదాగా చదివేద్దామా..

చెట్టుతో చెట్టపట్టాల్‌

డ్రాయింగ్‌ పేపర్‌ తీసుకొని దానికి గమ్‌ సాయంతో కర్రపుల్లల్ని చెట్టు ఆకారంలో అతికించండి. ఓ పదినిముషాలు ఆరనిచ్చిన తర్వాత చిత్రంలో చూపించినట్లు పాప్‌కార్న్‌ను కొమ్మలకు గమ్‌తో అతికించండి. పాప్‌కార్న్‌ చెట్టు తయారవుతుంది.

పాప్‌కార్న్‌ మ్యాన్‌

నకు స్నోమ్యాన్‌ తెలుసుగా?! ఈ సారి సరదాగా స్నోమ్యాన్‌ను పాప్‌కార్న్‌తో చేద్దామా. ముందుగా డ్రాయింగ్‌ పేపర్‌ తీసుకొని దాని మీద పెన్సిల్‌తో స్నోమ్యాన్‌ ఆకారాన్ని గీయాలి. చేతులు, టోపీ, కళ్లు, నోరు, ముక్కు కోసం మరో కలర్‌ డ్రాయింగ్‌ పేపర్‌ను చిత్రంలో చూపించినట్లు కత్తిరించుకోవాలి. పెన్సిల్‌తో గీసుకున్న ఆకారంలోపల ఇప్పుడు పాప్‌కార్న్‌ను గమ్‌ సాయంతో అతికించాలి. కాసేపు ఆరిన తర్వాత చేతులు, టోపీ, కళ్లు, ముక్కు, నోరు అతికించండి. పాప్‌కార్న్‌ మ్యాన్‌ సిద్ధం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని