వాక్యాల్లో జంతువుల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని జంతువుల పేర్లు దాగి ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న అక్షరాలను ఓ చోటకు చేరిస్తే అవి దొరుకుతాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం?

Updated : 27 Sep 2020 01:08 IST

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని జంతువుల పేర్లు దాగి ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న అక్షరాలను ఓ చోటకు చేరిస్తే అవి దొరుకుతాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం?

1. ఒరేయ్‌ గోపి.. ఆ ఉల్లిపాయలు ఇటు తీసుకురా..

2. పీపాలో ముగ్గురు దొంగలున్నారు.

3. పాపం.. లిల్లీ ఎందుకు అలా దిగులుగా కూర్చుంది?

4. మే నెలలో నాకు అసలు తీరిక లేదు తెలుసా!

5. ఈ నలుగురికీ ఆమే అక్క.




తమాషా ప్రశ్నలు

1. బంగారం దుకాణంలో దొరకని నగలు?

2. జుట్టు లేని ఆడవారికి వరం?

3. ఒంటెలు ఎప్పుడు నిద్రపోతాయి?



జవాబులు

తమాషా ప్రశ్నలు: 1.శనగలు 2.సవరం 3.వాటికి నిద్ర వచ్చినప్పుడు

వాక్యాల్లో జంతువుల పేర్లు: 1.పిల్లి 2.పాము 3.పంది 4.మేక 5.నక్క

మెదడుకు మేత: 1) 15 (22-1=3, 33-1=8, 44-1=15) 2) 9 (5+2=7, 3-1=2, 7+2=9)

లెక్క తేల్చండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని