మినిట్‌లో మగ్‌ పిజా!

ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌- అర కప్పు, బేకింగ్‌ పౌడర్‌- పావు చెంచా, బేకింగ్‌ సోడా- చిటికెడు, ఉప్పు- చిటికెడు, పాలు- నాలుగు పెద్ద చెంచాలు, ఆలివ్‌ నూనె, పిజా సాస్‌- పెద్ద చెంచా చొప్పున,....

Updated : 12 Dec 2021 05:18 IST

కావాల్సినవి: ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌- అర కప్పు, బేకింగ్‌ పౌడర్‌- పావు చెంచా, బేకింగ్‌ సోడా- చిటికెడు, ఉప్పు- చిటికెడు, పాలు- నాలుగు పెద్ద చెంచాలు, ఆలివ్‌ నూనె, పిజా సాస్‌- పెద్ద చెంచా చొప్పున, చీజ్‌ తరుగు- రెండు పెద్ద చెంచాలు, చిల్లీ పెప్పర్‌- కొద్దిగా, బ్లాక్‌ ఆలివ్స్‌- కొన్ని, డ్రై ఒరిగానో- పావు చెంచా.

తయారీ: ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు.. ఈ పదార్థాలన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి కప్పులో వేసి కలపాలి. ఆ తర్వాత పాలు పోసి బాగా కలపాలి. పిజా సాస్‌ను కప్పులోని బ్యాటర్‌పై అంతటా పరుచుకునేలా రాయాలి. చీజ్‌, మిరియాల పొడి, ఆలివ్‌ నూనె, ఒరిగానో... అన్నింటిని వేసి నిమిషంపాటు 200 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద అవెన్‌లో పెట్టాలి. అంతే రుచికరమైన మగ్‌ పిజా రెడీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని