నిమిషంలో.. కేక్‌!

ఏదైనా తియ్యగా తినాలనిపిస్తోందా. దాంట్లో పోషకాలూ ఉండాలా...అయితే ఈ వన్‌మినిట్‌ ఓట్స్‌ మగ్‌ కేక్‌ మీ కోసమే... దీన్ని నిమిషంలో తయారు చేసుకోవచ్చు. మీరూ ప్రయత్నించండి మరి.

Published : 06 Feb 2022 00:38 IST

ఏదైనా తియ్యగా తినాలనిపిస్తోందా. దాంట్లో పోషకాలూ ఉండాలా...అయితే ఈ వన్‌మినిట్‌ ఓట్స్‌ మగ్‌ కేక్‌ మీ కోసమే... దీన్ని నిమిషంలో తయారు చేసుకోవచ్చు. మీరూ ప్రయత్నించండి మరి.
కావాల్సినవి: ఓట్స్‌ పొడి, గోధుమ పిండి, బ్రౌన్‌ షుగర్‌- మూడు పెద్ద చెంచాల చొప్పున; బేకింగ్‌ పౌడర్‌- పావు చెంచా, ఉప్పు, దాల్చినచెక్క- చిటికెడు, కిస్‌మిస్‌- ఐదు, నూనె, మజ్జిగ- రెండు పెద్ద చెంచాల చొప్పున, వెనిల్లా ఎస్సెన్స్‌- అర చెంచా, అరటిపండు గుజ్జు- పావు కప్పు, గుడ్డు- ఒకటి.
తయారీ: ఓ కప్పులో ఓట్స్‌ పొడి, గోధుమ పిండి, బ్రౌన్‌ షుగర్‌; బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఇందులో కిస్‌మిస్‌, గిలకొట్టిన గుడ్డు సొన వేసి బాగా కలపాలి. నూనె, మజ్జిగలనూ జత చేయాలి. వెనిల్లా ఎస్సెన్స్‌, అరటిపండు గుజ్జును వేసి మరోసారి మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. దీన్ని అవెన్‌లో పెట్టి నిమిషం బేక్‌ చేస్తే రుచికరమైన ఓట్స్‌ మగ్‌ కేక్‌ రెడీ.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని