చిన్నారులకు కూల్‌ బైట్స్‌..

వేసవిలో మీ చిన్నారులకు చల్లని బైట్స్‌ అందించొచ్చు. పెరుగుతో పండ్లను కలిపి చేసే ‘యోగర్ట్‌ బైట్స్‌’ రుచి పిల్లలకు బాగా నచ్చుతుంది.  వీటిని సులువుగా చేసేయొచ్చు. పండ్ల ముక్కలకు పెరుగు, కాస్తంత తేనె కలిపి, మిక్సీలో వేసి మెత్తగా

Published : 17 Apr 2022 01:46 IST

వేసవిలో మీ చిన్నారులకు చల్లని బైట్స్‌ అందించొచ్చు. పెరుగుతో పండ్లను కలిపి చేసే ‘యోగర్ట్‌ బైట్స్‌’ రుచి పిల్లలకు బాగా నచ్చుతుంది.  వీటిని సులువుగా చేసేయొచ్చు. పండ్ల ముక్కలకు పెరుగు, కాస్తంత తేనె కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ  మిశ్రమాన్ని కేకు కప్పుల్లో నింపి కొన్నిగంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. కేకుల్లా అనిపించే ఈ ఫ్రోజన్‌ యోగర్ట్‌ బైట్స్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు.  అలాగే పెరుగు, పండ్ల మిశ్రమాన్ని కోన్‌లో నింపి బైట్స్‌ లేదా బార్స్‌గా ట్రేలో సర్ది బేక్‌ చేసి స్నాక్స్‌గానూ అందించొచ్చు.  ఇలా మీ చిన్నారులకు నచ్చేలా  వినూత్నంగా చేసి పెట్టండి మరి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని