ఐస్‌క్రీమ్‌ కుకీస్‌ కావాలా!

మండే ఎండల్లో ఎవరైనా చల్లచల్లని మిల్క్‌షేకో, శీతల పానీయమో తాగుతారు... కానీ కుకీస్‌ తింటారా... అయితే ఫొటోల్లోని బిస్కెట్లను చూశాక చిన్నా పెద్దా అంతా వాటినే కావాలంటారు....

Published : 24 Apr 2022 00:56 IST

మండే ఎండల్లో ఎవరైనా చల్లచల్లని మిల్క్‌షేకో, శీతల పానీయమో తాగుతారు... కానీ కుకీస్‌ తింటారా... అయితే ఫొటోల్లోని బిస్కెట్లను చూశాక చిన్నా పెద్దా అంతా వాటినే కావాలంటారు.... ఎందుకంటే అవి చల్లని ఐస్‌క్రీమ్‌ కుకీస్‌ మరీ. రకరకాల ఫ్లేవర్లు, విభిన్న ఆహార పదార్థాలను చేర్చి అందరికీ నచ్చేలా, అందంగా, ఆకర్షణీయంగా, రుచిగా చేసి వినియోగదారుల మనసు దోచుకుంటున్నారు. కాస్త శ్రమ పడితే ఇంట్లోనూ చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో ‘ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ కుకీస్‌’ అని వెతికి చూడండి.. బోలెడు వెరైటీలు దొరుకుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని