హైదరాబాద్‌... అస్లీ ఐస్‌క్రీం... కేరాఫ్‌ ఎంజే మార్కెట్‌!

బజారులో దొరికే బ్రాండ్‌ ఐస్‌క్రీంల రుచి మనకు తెలిసిందే! అలాకాకుండా హైదరాబాద్‌ అస్లీ ఐస్‌క్రీం రుచి చూడాలంటే ఎంజే మార్కెట్‌కి వెళ్లాల్సిందే. నిజాం రెండో కుమారుడు ప్రిన్స్‌ మొజంజా పేరుతో నిర్మించిన

Published : 08 May 2022 00:17 IST

బజారులో దొరికే బ్రాండ్‌ ఐస్‌క్రీంల రుచి మనకు తెలిసిందే! అలాకాకుండా హైదరాబాద్‌ అస్లీ ఐస్‌క్రీం రుచి చూడాలంటే ఎంజే మార్కెట్‌కి వెళ్లాల్సిందే. నిజాం రెండో కుమారుడు ప్రిన్స్‌ మొజంజా పేరుతో నిర్మించిన ఎంజే మార్కెట్‌లోని గ్రానైట్‌ రాళ్ల కట్టడానికి ఎంత పేరుందో అంతకంటే ఎక్కువగా అక్కడ దొరికే ఐస్‌క్రీంలకు ఉంది. ఆయా సీజన్లలో దొరికే పండ్లతో ఐస్‌క్రీంలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. తక్కువ ధరకి దొరుకుతాయి. మహమ్మద్‌ హలీం ప్రారంభించిన ఫేమస్‌ ఐస్‌క్రీం పార్లర్‌కి ఆదరణ పెరిగిన తర్వాత బిలాల్‌, షా, కపూర్‌ పార్లర్లూ తోడయ్యి ఇక్కడి ఐస్‌క్రీంలకు మరింత ఆదరణ తెచ్చిపెట్టాయి. వేసవి రోజుల్లో సాయంత్రాలు ఇక్కడ కూర్చుని మామిడి, లిచీ, సపోటా, ద్రాక్ష, మస్క్‌మిలన్‌తో చేసిన హిమక్రీ¨ముల రుచి చూడ్డానికి పోటీపడతారు.

- జి. వసంత్‌, ఈనాడు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని