పండ్లు కాదు... పేస్ట్రీలివి!

చూడ్డానికి పండ్లలానే ఉన్నాయి. కోస్తే.. మధ్యలో తేడాగా ఉందే అనేగా మీ సందేహం! పారిస్‌ చెఫ్‌ సెడ్రిక్‌ గ్రోలెట్‌ మాయాజాలం అదంతా! మనం చూస్తున్నవి ఏవీ పండ్లు కాదు. అవి పేస్ట్రీలు. వీటిని ఫ్రూట్‌ పేస్ట్రీలు అంటారు. ఇవి చేయడంలో సెడ్రిక్‌ దిట్ట. ఇతను చేసిన ఈ పేస్ట్రీలను చూసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో

Updated : 29 May 2022 03:15 IST

చూడ్డానికి పండ్లలానే ఉన్నాయి.  కోస్తే .. మధ్యలో తేడాగా ఉందే అనేగా మీ సందేహం! పారిస్‌ చెఫ్‌ సెడ్రిక్‌ గ్రోలెట్‌ మాయాజాలం అదంతా! మనం చూస్తున్నవి ఏవీ పండ్లు కాదు. అవి పేస్ట్రీలు. వీటిని ఫ్రూట్‌ పేస్ట్రీలు అంటారు. ఇవి చేయడంలో సెడ్రిక్‌ దిట్ట. ఇతను చేసిన ఈ పేస్ట్రీలను చూసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలమంది అనుసరిస్తున్నారతన్ని. చిన్నతనంలో సెడ్రిక్‌కి వాళ్లమ్మ స్వీట్లకి బదులు ఆరోగ్యానికి మంచివని పండ్లనే ఇచ్చేదట. కానీ వంటమీద ప్రేమతో చెఫ్‌ అయిన అతను పండ్ల రూపంలో పేస్ట్రీలు చేయడం మొదలుపెట్టాడు. నిమ్మ, నారింజ, గ్రీన్‌ ఆపిల్‌, పీచ్‌, చెర్రీ వంటి పండ్లని పోలిన పేస్ట్రీలు చేస్తుంటాడు. అవి చేయాలనుకొనే వారికోసం ఫ్రూట్స్‌ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. మీకూ ఆసక్తి ఉంటే అతని ఇన్‌స్టాలోకి ఓసారి తొంగి చూడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని