వీటిని తినేయొచ్చు!

అమౌరీగుయికాన్‌ తయారుచేసిన పేస్ట్రీలని చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే! అంత అద్భుతంగా ఉంటాయి మరి. అందుకే అతన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో 90లక్షలమంది, యూట్యూబ్‌లో ఐదు లక్షలమంది అనుసరిస్తున్నారు..

Published : 10 Jul 2022 00:58 IST

మౌరీగుయికాన్‌ తయారుచేసిన పేస్ట్రీలని చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే! అంత అద్భుతంగా ఉంటాయి మరి. అందుకే అతన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో 90లక్షలమంది, యూట్యూబ్‌లో ఐదు లక్షలమంది అనుసరిస్తున్నారు.. మొదట్లో పేస్ట్రీల తయారీని ఓ అభిరుచిగా మాత్రమే భావించిన అమౌరి ఆ రంగంలో 16 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించాడు. తర్వాత... అందులో మెలకువలని తెలుసుకోవాలని ప్రపంచం మొత్తం తిరిగాడు. అలా నేర్చుకున్న మెలకువలతో అద్భుతమైన పేస్ట్రీలు తయారీని చేపట్టాడు. ఇప్పుడు మీరు చూస్తున్న స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ దగ్గర నుంచి తక్కిన అద్భుతాలన్నీ అతను తయారుచేసినవే. ఆసక్తి ఉన్నవారికి నేర్పించడం కోసం లాస్‌వేగాస్‌లో ఓ పేస్ట్రీ అకాడమీని కూడా ప్రారంభించాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని