మోదక్‌ కేకులొస్తున్నాయ్‌!

మోదక ప్రియా వినాయకా అంటాం.. ఈ మోదక్‌లని సాధారణంగా.. బియ్యప్పిండి, కొబ్బరి, బెల్లం వంటివి వాడి చేస్తారు. సంప్రదాయ మోదక్‌ల తయారీకి జైకొడుతూనే..

Published : 28 Aug 2022 00:23 IST

మోదక ప్రియా వినాయకా అంటాం.. ఈ మోదక్‌లని సాధారణంగా.. బియ్యప్పిండి, కొబ్బరి, బెల్లం వంటివి వాడి చేస్తారు. సంప్రదాయ మోదక్‌ల తయారీకి జైకొడుతూనే.. కొత్త సృజనలూ చేస్తున్నారు. కోవా, గుల్‌ఖండ్‌, చాక్లెట్‌ వంటివి వాడుతూ కొత్త రుచులతో వీటిని చేస్తున్నారు. ఇప్పుడు మరికాస్త కొత్తగా మోదక్‌ కేక్‌లు కూడా సందడి చేస్తున్నాయి. మోదక్‌ల ఆకృతిలో తయారుచేసిన ఈ కేకులు మార్కెట్లో దొరుకుతున్నాయి. తక్కిన ప్రసాదాలతోపాటు వీటినీ ప్రసాదంగా పెడుతున్నారు భక్తులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని