ఈ గడ్డి... బరువు తగ్గిస్తుంది!

అగర్‌అగర్‌.. దీన్నే చైనా గ్రాస్‌, జున్ను గడ్డి, కడల్‌ పాచీ, సముద్ర నాచు అని కూడా అంటారు. పిల్లలు తినే జెల్స్‌, కేకుల్లో దీన్ని జెలాటిన్‌కి ప్రత్యామ్నాయంగా వాడతారు.

Updated : 23 Nov 2022 11:13 IST

గర్‌అగర్‌.. దీన్నే చైనా గ్రాస్‌, జున్ను గడ్డి, కడల్‌ పాచీ, సముద్ర నాచు అని కూడా అంటారు. పిల్లలు తినే జెల్స్‌, కేకుల్లో దీన్ని జెలాటిన్‌కి ప్రత్యామ్నాయంగా వాడతారు. జెలాటిన్‌తో పోలిస్తే.. ఇది ఆరోగ్యవంతమే కాదు పోషకభరితం కూడా...
* చూడ్డానికి తెల్లగా, గడ్డిపరకల్లా కనిపించే అగర్‌లో కెలొరీలు ఉండవు. పీచు పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది బరువు తగ్గాలనుకొనే వారికి చక్కని ఆహారం. అగర్‌తో చేసిన జెల్స్‌, ఇతరత్రా వంటకాలు బరువు తగ్గించడానికి సాయపడతాయి. అయితే అగర్‌ని తింటే నీళ్లు కూడా ఎక్కువగా తాగాలి. అగర్‌ శరీరంలోపలి వ్యర్థాలను బయటకు నెట్టేసి.. మలబద్ధకం రాకుండా చేస్తుంది. చర్మాన్ని, జుట్టుని మెరిసేటట్టు చేస్తుంది. జపాన్‌లో కాన్‌టెన్‌ డైట్‌ పేరుతో అగర్‌ని ఎక్కువగా వాడతారు. బరువు తగ్గడమే ఈ డైట్‌ లక్ష్యం.
మెకాళ్ల నొప్పులు, ఎముక సంబంధిత సమస్యలతో బాధపడేవారికి... అగర్‌ మంచి ఆహారం. ఇది పొడి రూపంలోనూ దొరుకుతుంది.
* పుడ్డింగ్స్‌, చీజ్‌కేకులు, మూసే, జామ్‌ వంటి వంటకాల్లో జెలాటిన్‌కి ప్రత్యామ్నాయంగా అగర్‌ని ఉపయోగించుకోవచ్చు.
* కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతుంది. రక్తహీనత రాకుండా చూస్తుంది. మెదడు చురుగ్గా ఉండేందుకు దోహదం చేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని