బ్రహ్మజెముడు.. మిఠాయిలు!

కాక్టస్‌ మొక్కలని ఎప్పుడైనా తిన్నారా? అమ్మో నిండా ముళ్లు ఉండే ఆ మొక్కని మరీ ముచ్చటపడితే పెంచుకుంటారు కానీ తింటారేంటి? అని ఆశ్చర్యపోతున్నారా! కాక్టస్‌ మొక్కలు ముళ్లతో భయపెట్టే మాట నిజమే కానీ...

Published : 25 Sep 2022 00:52 IST

కాక్టస్‌ మొక్కలని ఎప్పుడైనా తిన్నారా? అమ్మో నిండా ముళ్లు ఉండే ఆ మొక్కని మరీ ముచ్చటపడితే పెంచుకుంటారు కానీ తింటారేంటి? అని ఆశ్చర్యపోతున్నారా! కాక్టస్‌ మొక్కలు ముళ్లతో భయపెట్టే మాట నిజమే కానీ... వాటిల్లో పోషకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ప్రిక్లీ పియర్‌ అనే రకంలో ఎక్కువ పోషకాలు ఉండటంతో, వాటితో చేసిన స్వీట్లకి ఆదరణ కూడా పెరుగుతోంది...

* రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కాక్టస్‌ జ్యూస్‌ ఔషధంలా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్‌ బి2, విటమిన్‌ ఎ లు కీళ్ల దగ్గర తలెత్తే నొప్పి, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
* హెచ్‌ఎస్‌వీ, హెచ్‌ఐవీ వంటి వైరస్‌లని అడ్డుకోవడంలోనూ కాక్టస్‌లోని పోషకాలు సహకరిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలోని విటమిన్‌ ఇ చర్మానికి మేలు చేస్తుంది.  
ఉత్పత్తులు: కాక్టస్‌తో చేసిన జామ్‌, జెల్లీ, స్మూతీలకు ఆదరణ పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో శుభ్రం చేసి తరిగిన ముక్కలు కూడా దొరుకుతున్నాయి. వీటితో నచ్చిన వంటకాలు చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని