కొయ్యద్దు.. లాగండి!

వేడుకల్లో కేకుని కోస్తాం కదా! కానీ ఈ కేకుని కోయకూడదు. పైనున్న కవర్‌ని లాగితే చాలు. అదే ‘పుల్‌మి అప్‌ కేకు’ల ప్రత్యేకత. ఇంతకీ లాగితే ఏమవుతుంది అనేగా మీ సందేహం. మామూలు కేకులకి భిన్నంగా ఉంటాయి ఇవి. బార్బీ లేదా ఏదైనా పిల్లలకి నచ్చిన కామిక్‌ పాత్రల్ని ఉంచి ఈ కేకులని తయారుచేస్తారు.

Published : 09 Oct 2022 00:04 IST

వేడుకల్లో కేకుని కోస్తాం కదా! కానీ ఈ కేకుని కోయకూడదు. పైనున్న కవర్‌ని లాగితే చాలు. అదే ‘పుల్‌మి అప్‌ కేకు’ల ప్రత్యేకత. ఇంతకీ లాగితే ఏమవుతుంది అనేగా మీ సందేహం. మామూలు కేకులకి భిన్నంగా ఉంటాయి ఇవి. బార్బీ లేదా ఏదైనా పిల్లలకి నచ్చిన కామిక్‌ పాత్రల్ని ఉంచి ఈ కేకులని తయారుచేస్తారు. వీటిపై అమర్చిన సీత్రూ కవర్‌ని లాగినప్పుడు అందులోని క్రీం, గ్లిట్టర్లు కేకుపై నుంచి జారుతూ ఆ బొమ్మకి సరికొత్త లుక్‌ని తీసుకొస్తాయి. ఈ మధ్యకాలంలో కామిక్‌ పాత్రలని కాకుండా... తమకిష్టమైన వాళ్ల ఫొటోలని ఉంచి ఈ కేకులని తయారుచేస్తున్నారు. కవర్‌లాగినపుడు జరిగే మ్యాజిక్‌ చూడ్డానికి భలేగా ఉంటుంది. దాంతో పిల్లలూ, పెద్దలూ ఇష్టపడి మరీ వీటిని ప్రత్యేకంగా తయారుచేయించుకుంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని