వాళ్లని పాన్‌కేక్‌తో పడేస్తా...

‘వీలైతే కప్పు కాఫీ అంటూ...’ అందరి మనసులూ దోచుకున్న జెనీలియా మంచి భోజన ప్రియురాలు మాత్రమే కాదు.. రుచికరమైన వంటకాలని చేయడంలోనూ నిష్ణాతురాలే. తన పిల్లల్ని సంతోషపరచాలనుకున్నప్పుడల్లా ఓ అద్భుతమైన వంటకం చేస్తానంటోందీ అమ్మడు.

Published : 09 Oct 2022 00:03 IST

‘వీలైతే కప్పు కాఫీ అంటూ...’ అందరి మనసులూ దోచుకున్న జెనీలియా మంచి భోజన ప్రియురాలు మాత్రమే కాదు.. రుచికరమైన వంటకాలని చేయడంలోనూ నిష్ణాతురాలే. తన పిల్లల్ని సంతోషపరచాలనుకున్నప్పుడల్లా ఓ అద్భుతమైన వంటకం చేస్తానంటోందీ అమ్మడు. ఇంతకీ అదేం వంటకమో తెలుసా? పాన్‌కేక్స్‌. అవేనండీ మనం వేసే అట్లు మాదిరిగానే ఉంటాయి కానీ.. మరికాస్త మృదువుగా, తీయగా ఉంటాయి. జెనీలియా చేసే పాన్‌కేక్స్‌ అంటే కొడుకు రియాన్‌ ప్రాణం పెడతాడట. ‘పిల్లలకు పెట్టే ఆహారం కాబట్టి వాటిల్లో వాడే పదార్థాలతో ఎక్కడా రాజీ పడను. పాన్‌కేక్స్‌లో సాధారణంగా వాడే మైదాకి బదులు ఓట్స్‌పిండిని ప్రత్యామ్నాయంగా వాడతాను. తక్కవ సమయంలో అయిపోయే బనానా పాన్‌కేక్స్‌ చేస్తుంటా’ అంటూ ఈ విషయాన్ని తన సోషల్‌మీడియాలో పంచుకుంది జెనీ. తన ఇన్‌స్టాలో ఆహారానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చాలానే పంచుకుంటూ ఉంటుంది. ఎక్కువగా వీగన్‌ పద్ధతులు అనుసరిస్తూ ఉంటుంది. అందుకే వీలైనంతవరకూ పాల పదార్థాలు లేని వంటకాలకి ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని