అల్లం కేకులు.. అందంగా!

క్రిస్‌మస్‌ అంటే కేకుల పండగ అని తెలుసుకదా! అయితే అల్లంతో చేసిన జింజర్‌ బ్రెడ్‌హౌస్‌ కేకులు ఈ పండగ ప్రత్యేకం.

Updated : 18 Dec 2022 00:28 IST

క్రిస్‌మస్‌ అంటే కేకుల పండగ అని తెలుసుకదా! అయితే అల్లంతో చేసిన జింజర్‌ బ్రెడ్‌హౌస్‌ కేకులు ఈ పండగ ప్రత్యేకం. విదేశాల్లో అయితే ప్రతి ఇంట్లోనూ ఈ జింజర్‌ బ్రెడ్‌హౌసులనీ, జింజర్‌ బ్రెడ్‌మాన్‌ ఎంతబాగా చేశారు అనే దానిపై పోటీలు కూడా పెట్టుకుంటారు. ఇంటిల్లిపాది ఈ బ్రెడ్‌హౌస్‌ కేకులని వీలైనంత అందంగా అలంకరిస్తారు. నిజానికి క్రిస్‌మస్‌ సెలవులకి అతిగా తిని పొట్ట పాడుచేసుకోకుండా అల్లం ఉపయోగపడుతుందని ఈ జింజర్‌ బ్రెడ్‌ సంస్కృతి వచ్చిందట. ఈ సంస్కృతి మన దేశంలోనూ వ్యాపించి ఇక్కడా ఈ కేకులని పోటీపడి అందంగా చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని