కేకో కేకస్య!
ఎన్ని ఇష్టమైన వంటకాలు ముందున్నా... మనం తినకుండా ఆగలేని ట్రీట్ ఏదైనా ఉందంటే అది కేక్. అందులోనూ క్రిస్‌మస్ మొదలుకుని కొత్త ఏడాది ఆరంభం వరకూ ఎక్కడ చూసినా వీటి హడావుడే. ఎంతసేపూ బేకరీలకు వెళ్లడమేనా? ఇంట్లో తయారుచేసి ఇంటిల్లిపాదీ ప్రశంసలు పొందాలనుకుంటున్నారా? అయితే వీటిని ప్రయత్నించండి..
చాక్లెట్ కేక్
కావాల్సినవి
మైదా- ఒకటి ముప్పావు కప్పు, కోకో పౌడర్- పావు కప్పు, ఉప్పు- చిటికెడు, తాజా గడ్డ పెరుగు- కప్పు, పంచదార పొడి- కప్పు, బేకింగ్ పౌడర్- అర చెంచా, వంటసోడా- పావుచెంచా, వెన్న- అర కప్పు, వెనిలా ఎస్సెన్స్- చెంచా, జీడిపప్పు, అక్రోట్లు, బాదం- అర కప్పు, పాలు- అరకప్పు
తయారీ
ముందుగా మైదా, కోకో పౌడర్, ఉప్పు వీటిని ఉండల్లేకుండా జల్లించి కలపాలి. పెరుగులో పంచదార పొడి కలిపి బాగా గిలక్కొట్టాలి. ఇందులో వంట సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తర్వాత కరిగించిన వెన్న, వెనిలా ఎస్సెన్స్ వేసి కలిపి మరి కొద్ది సేపు గిలక్కొట్టాలి. జల్లించిన మైదా, కోకోపౌడర్ మిశ్రమం, సన్నగా కట్ చేసుకున్న డ్రైఫ్రూట్స్ కూడా వేసి కలపాలి. పిండి జారుగా ఉండడానికి అవసరమైతే కొద్దిగా పాలు కలపాలి. ఒక కేకు టిన్నులో లోపల భాగమంతా వెన్న రాసి, ఆపై కొద్దిగా మైదా వేసి మొత్తం గిన్నెకంతా అంటుకునేట్టు చేయాలి. ఇందులో కేకు మిశ్రమాన్ని వేసి ముందే వేడి చేసుకున్న ఓవెన్‌లో 180 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 45-50 నిమిషాలు బేక్ చేయాలి. రుచికరమైన చాక్లెట్ కేక్ రెడీ అవుతుంది. మీకు కావాలంటే ఐసింగ్ చేసుకోవచ్చు. లేదంటే అలాగే ముక్కలు చేసి సర్వ్ చేసుకోవచ్చు.
మార్బుల్ కేక్
కావాల్సినవి
బటర్- 150గ్రా, మెత్తని పంచదార పొడి- 150గ్రా, పాలు- ముప్పావు కప్పు, వెనిగర్- 3 చెంచాలు, మైదా పిండి- 150గ్రా, వెనిలా ఎసెన్స్- చెంచా, కోకోపొడి- చెంచా, బేకింగ్ పౌడర్- ఒకటిన్నర చెంచా
తయారీ
ఒక పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా గిలక్కొట్టాలి. పాలు, వెనిగర్ వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమంలో మైదా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని రెండు భాగాలు చేయాలి. ఒక సగంలో కోకో పౌడర్ వేసుకొని కలపాలి. వెన్నరాసిన కేక్ ప్లేట్ మిశ్రమాలను ఒక దాని మీద ఒకటి పోసుకోవాలి. 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన ఓవెన్ లో ట్రే ఉంచి, సుమారు 25 నిమిషాలు బేక్ చేసి బయటకు తీసి చల్లారాక ముక్కలు చేసుకొని సర్వ్ చేసుకోవాలి
టూటీ ఫ్రూటీ కప్ కేక్
కావాల్సినవి
గుడ్లు- నాలుగు, మైదా- ముప్పావు కప్పు, వెన్న- 150గ్రా, చక్కెర- 150గ్రా, టూటీఫ్రూటీలు- 50గ్రా, వెనిలా ఎసెన్స్- చెంచా, బేకింగ్ పౌడర్- అరచెంచా, యాలకుల పొడి- చెంచా
తయారీ
ముందుగా అవెన్‌ని ప్రీహీట్ చేసి 180 డిగ్రీలో దగ్గర వేడి చేసుకొని సిద్ధంగా ఉంచాలి. ఒక బౌల్‌లో వెన్న, చక్కెర పొడి వేసుకొని బాగా కలపాలి. అందులోనే గుడ్లు పగలగొట్టి సొన వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో మైదా వేసి ఉండల్లేకుండా నిదానంగా కలపాలి. యాలకుల పొడి, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, చివరిగా టూటీ ఫ్రూటీ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కేక్ కప్పులకు లోపల వెన్న రాసి ఈ మిశ్రమాన్ని వాటిల్లో నింపాలి. వేడయ్యాక పిండి పైకి పొంగుతుంది కాబట్టి, నిండా వేయకుండా కొద్దిగా వెలితిగా వేయాలి. కప్పులను ఓవెన్‌లో పెట్టి 180 డిగ్రీల దగ్గర 25 నుంచి 30 నిమిషాలపాటు బేక్ చేసుకోవాలి. కాసేపు చల్లారనిస్తే రుచికరమైన టూటీ ఫ్రూటీ కప్ కేక్‌లు సిద్ధమైనట్టే.
చెర్రీ కేక్
కావాల్సినవి
పాలు- 150ఎం.ఎల్, మైదాపిండి- 250గ్రా, గుడ్లు- 6, చక్కెర పొడి- 200గ్రా, బాదంపప్పు- 50గ్రా, ఎండు చెర్రీలు- 50గ్రా (ముక్కలుగా చేసుకోవాలి), బేకింగ్ పౌడర్- చెంచా, వంటసోడా- అర చెంచా, వెన్న- 250గ్రా, బాదం ఎసెన్స్- చెంచా
తయారీ
బాదం పప్పులను కాసేపు వేడినీటిలో వేసి పైన పొట్టు తీసేసి ముక్కలు చేసుకోవాలి. మైదా, బేకింగ్ పౌడర్, వంటసోడా ఒక గిన్నెలో వేసుకొని జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వెన్నలో చక్కెర పొడి, బాదం ఎసెన్స్, గుడ్లు వేసుకొని మృదువుగా అయ్యే వరకూ గిలక్కొట్టువాలి. ఇప్పుడు ముందే ముక్కలు చేసి పెట్టుకున్న బాదం పప్పులను, చెర్రీముక్కలని కలపాలి. ఈ మిశ్రమంలో ముందుగా జల్లించి పెట్టుకున్న మైదాపిండిని వేసి, పాలని కొద్ది కొద్దిగా పోసుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని బేకింగ్ డిష్‌లోకి మార్చి అవెన్‌లో 180 డిగ్రీ ప్రీహీట్ వద్ద నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చల్లారిన తరువాత రుచికరమైన బాదం చెర్రీ కేక్ సర్వ్ చేసుకోవచ్చు.
క్రిస్మస్ స్పెషల్ కేక్
కావాల్సినవి
మైదా- కప్పు, వాల్‌నట్స్- 2 చెంచాలు(సన్నగా తరిగినవి), బేకింగ్ పౌడర్- అరచెంచా, ఎండుద్రాక్షలు- మూడు చెంచాలు, టూటీ ఫ్రూటీ- 4 చెంచాలు, బ్రౌన్ పంచదార- కప్పు, వెనిలా ఎసెన్స్- 4చుక్కలు, గుడ్లు- 3, వెన్న- అరకప్పు, లెమన్ జెస్ట్ (నిమ్మకాయపైన ఉండే తొక్క )- చెంచా, చెర్రీస్- 2 చెంచాలు(సగానికి కోసినవి) గార్నిషింగ్ కోసం
తయారీ
అవెన్‌ను 160డిగ్రీ సెల్సియస్‌లో వేడిచేసుకుని సిద్ధం చేసుకోవాలి. తర్వాత మైదా, బేకింగ్ పొడిని కలిపి జల్లెడ పట్టుకోవాలి. అందులో వాల్‌నట్స్ తురుము, ఎండుద్రాక్షలు, టూటీఫ్రూటీలు వేసి కలపాలి. మరో పాత్రలో వెన్న, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలపాలి. ఇది బాగా క్రీమ్‌లా తయారయ్యే వరకూ మిక్స్ చేసుకొని.. అందులో వెనీలా ఎసెన్స్, గుడ్డు, లెమన్ జెస్ట్ వేసి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు మైదా, బేకింగ్ సోడా మిశ్రమాన్ని వేసి, బాగా కలపాలి. కేక్‌టిన్‌కు వెన్నరాసుకోవాలి. అందులో సిద్ధం చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని పోసుకొని 30- 40నిమిషాలు బేక్ చేసిన తర్వాత, చల్లారనివ్వాలి. క్రిస్మస్ స్పెషల్ కేక్ తినడానికి రెడీ. దీన్ని స్లైస్ గా కట్ చేసి ముక్కలు చేసుకున్న తర్వాత చెర్రీలను గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి
చెఫ్ పవన్ సిరిగిరి, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Indian Railway: ఆర్పీఎఫ్లో 20 వేల ఉద్యోగాలు.. రైల్వేశాఖ క్లారిటీ
-
World News
America: అమెరికాలో విరుచుకుపడిన టోర్నడోలు.. 10 మంది మృతి
-
Sports News
LSG vs DC: బ్యాటింగ్‌లో మేయర్స్.. బౌలింగ్‌లో మార్క్‌వుడ్.. దిల్లీపై లఖ్‌నవూ సూపర్ విక్టరీ
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
India News
PM CARES Fund: పీఎం సహాయ నిధికి మరో రూ.100 కోట్లు
-
World News
UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!