గట్టిగా కాదు.. మృదువుగా

కొత్త సంవత్సరం కోసం ఇంట్లోనే కేక్‌ చేయాలని ఉంది. కానీ ఎప్పుడు చేసినా గట్టిగా వస్తున్నాయి. కేకు మృదువుగా రావాలంటే ఏవైనా సలహాలు చెప్పండి?

Published : 25 Dec 2022 01:03 IST

కొత్త సంవత్సరం కోసం ఇంట్లోనే కేక్‌ చేయాలని ఉంది. కానీ ఎప్పుడు చేసినా గట్టిగా వస్తున్నాయి. కేకు మృదువుగా రావాలంటే ఏవైనా సలహాలు చెప్పండి?

కేక్‌ చేసేటప్పుడు అవెన్‌ని ముందుగానే వేడిచేసి సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే కేకు తయారీలో వాడే గుడ్లు, మైదా వంటి పదార్థాలు ఏవైనా సరే... గది ఉష్ణోగ్రత వద్ద ఉండటం తప్పనిసరి. ఒకటి వేడిగా, ఒకటి చల్లగా ఇలా ఉండకూడదు. బేకింగ్‌ ట్రేని మరీ పెద్దది, మరీ చిన్నది కాకుండా పిండి కొలతలని బట్టి ఎంచుకోవాలి. అలాగే పాన్‌ని పూర్తిగా కేక్‌బ్యాటర్‌తో నింపేయకుండా పావువంతు వెలితిగా నింపితే కేక్‌పైకి పొంగిపోకుండా చక్కగా వస్తుంది. బేకింగ్‌ చేసేటప్పుడు ట్రేలో అడుగున నాన్‌స్టిక్‌ బేక్‌మ్యాట్స్‌ దొరుకుతున్నాయి. అవి వాడితే కేకులు చక్కగా మీరు అనుకున్నట్టుగా వస్తాయి. కేక్‌ ఉడికిందా లేదా అని తెలుసుకొనేందుకు టూత్‌పిక్‌తో గుచ్చి చూస్తే అర్థమైపోతుంది. అలాగే అవెన్‌ నుంచి కేక్‌ని తీశాక... 20 నిమిషాలు వదిలేయండి. చల్లారాక అప్పుడు పాన్‌ నుంచి తీయండి. అవెన్‌లో ఓ పక్కకు కాకుండా మధ్యలో ఉంచితే సరిగ్గా ఉడుకుతుంది.  

మారియో చెరిమాన్‌, హస్పిటాలిటీ, గీతం విశ్వవిద్యాలయం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు