ఇంట్లోనే పిజా సాస్‌

ఇంట్లో పిజా సాస్‌ని చేయగలుగుతామా? చేయడానికి ఏదైనా చిట్కాలు చెప్పండి?

Published : 26 Feb 2023 00:14 IST

ఇంట్లో పిజా సాస్‌ని చేయగలుగుతామా? చేయడానికి ఏదైనా చిట్కాలు చెప్పండి?

సౌజన్య, కూకట్‌పల్లి

కావాల్సినవి:  ఆలివ్‌ నూనె- కప్పు, వెల్లుల్లి పలుకులు- రెండు చెంచాలు, తరిగిన టొమాటోలు- రెండు కప్పులు, డ్రై బేసిల్‌- రెండు చెంచాలు, డ్రై ఒరేగానో- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, మిరియాలపొడి- చెంచా

తయారీ: టొమాటోలను బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఒక పాన్‌లో ఆలివ్‌ ఆయిల్‌ వేడి చేయాలి. అందులో తరిగిన వెల్లుల్లిని వేసి 4 నుండి 5 సెకన్ల పాటు తక్కువ వేడి మీద వేయించాలి. ఇందులో మెత్తగా గ్రైండ్‌ చేసుకున్న టొమాటో ప్యూరీ వేసి 4 నుండి 5 నిమిషాలు తక్కువ మంట మీద వేడిచేయాలి. ఆ తర్వాత డ్రైబేసిల్‌, ఒరేగానో, ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. సాస్‌ చిక్కగా అయ్యేంతవరకూ తక్కువ మంట మీద 25 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. తర్వాత చల్లార్చుకుని వెంటనే వాడుకోవచ్చు. లేదంటే ఫ్రిజ్‌లో దాచుకోవచ్చు. ఇది రెండు నెలల వరకూ నిల్వ ఉంటుంది.

సాస్‌ మృదువుగా బయట దొరికే దానిలా కనిపించాలంటే టొమాటోలను మిక్సీలో మెత్తగా పలుకుల్లేకుండా ప్యూరీలా చేసుకోవాలి. టొమాటోలు మరీ పుల్లగా ఉంటే చెంచా చక్కెర కలపాలి. సాస్‌ స్పైసీగా ఉండాలనుకుంటే చెంచా మిరియాలు లేదా ఎర్ర మిరప కారం పొడిని కలపాలి. టొమాటోలు దొరక్కపోతే మార్కెట్‌లో రెడీమేడ్‌గా దొరికే క్యాన్డ్‌ టొమాటో ప్యూరీని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యూరీ మరీ చిక్కగా ఉంటే కాసిని నీళ్లు కలపాలి. సాస్‌లో రెండు చెంచాల వరకూ డ్రైబెసిల్‌ పొడిని కలపొచ్చు. అలాగే ఇటాలియన్‌ మసాలా అని దొరుకుతుంది. అది కలిపినా చక్కని రుచి వస్తుంది. తాజా ఒరేగానోను జోడిస్తే ఈ రుచి రెట్టింపవుతుంది. సాధారణంగా ఆలివ్‌ ఆయిల్‌ వాడతారు ఈ సాస్‌ తయారీకి. బదులుగా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లేదా కుసుమ నూనెని కూడా వాడుకోవచ్చు. వీటికి వెన్నని కూడా ఉపయోగించవచ్చు. నల్ల మిరియాలు బదులుగా తెలుపు మిరియాలు ఉపయోగిస్తే రుచి, రంగు బాగుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని