Updated : 19 Mar 2023 00:56 IST

ఆడుతూ.. ఐస్‌క్రీం

వేసవి కాలం పిల్లలకు కాస్త తీరిక సమయం. ఇంటి పనులూ, వంటపనులూ నేర్చుకొనేది కూడా ఇప్పుడే! మీరూ పిల్లలకు ఇలా వేసవిలో ఏదో ఒకటి నేర్పించాలనుకుంటున్నారా? అయితే ఈ సాఫ్ట్‌బాల్‌ ఐస్‌క్రీంని ప్రయత్నించండి. చూడ్డానికి ఆడుకొనే బంతిలా ఉంది కదా? దీంతో పిల్లలు ఆడుకుంటూనే ఐస్‌క్రీంని తయారుచేయొచ్చు. బంతి పైమూతని తీసి.. ఉప్పు, పంచదార, క్రీం ఇలా అవసరమైన పదార్థాలు వేస్తే చాలు. తర్వాత పిల్లలు అరగంటపాటు ఈ బంతితో ఆడుకోవడమే. ఆ తర్వాత మూత తీస్తే ఐస్‌క్రీం రెడీ. ఆటపాటలతోపాటు రుచికరమైన ఐస్‌క్రీంని తయారు చేసేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు