పార్‌ఫెయిట్‌..పొరపొరదో రుచి!

సామాజిక మాధ్యమాలొచ్చాక ఏం తిన్నాం అన్నది కాదు.. ఎలా తిన్నాం అన్నది కూడా ముఖ్యమే అయిపోయింది. అలాంటి వారంతా ఇప్పుడు పారాఫెయిట్‌ ట్రెండుని అనుసరిస్తున్నారు

Updated : 26 Mar 2023 03:32 IST

సామాజిక మాధ్యమాలొచ్చాక ఏం తిన్నాం అన్నది కాదు.. ఎలా తిన్నాం అన్నది కూడా ముఖ్యమే అయిపోయింది. అలాంటి వారంతా ఇప్పుడు పారాఫెయిట్‌ ట్రెండుని అనుసరిస్తున్నారు. ఫారాఫెయిట్‌ అంటే.. తాజా పండ్ల ముక్కలు, ఐస్‌క్రీం, గ్రనోలా వంటివాటిని గాజు గ్లాసుల్లో కనిపించేలా పొరలుగా అమర్చే పద్ధతి ఇది. జపాన్‌లో అయితే ఫారాఫెయిట్‌ పోటీలు పెడతారు. పండ్లముక్కలని వీలైనంత అందంగా అమర్చినవారే విజేతలు. మోచా గ్రీన్‌టీపొడి, ఐస్‌క్రీం, స్ట్రాబెర్రీ, చెర్రీలను ఇలా అందంగా అమరుస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని