పచ్చబ్రెడ్డుకి... మొదటి బహుమతి!

గ్రీన్‌మచా అంటే తేయాకే కానీ.. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే విధంగా ప్రత్యేక పద్ధతిలో తయారుచేసే టీపొడి. జపాన్‌లో గ్రీన్‌మచా వినియోగం ఎక్కువ.

Published : 21 May 2023 00:21 IST

గ్రీన్‌మచా అంటే తేయాకే కానీ.. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే విధంగా ప్రత్యేక పద్ధతిలో తయారుచేసే టీపొడి. జపాన్‌లో గ్రీన్‌మచా వినియోగం ఎక్కువ. తాజాగా దీనితో బ్రెడ్‌ని తయారుచేసి బ్రిటన్‌లో జరిగే పోటీల్లో బెస్ట్‌ బ్రెడ్‌ అవార్డుని గెలుచుకుంది మియో అయోట్సు..

యూకేలో ఏటా ఫుడ్‌ అండ్‌ డ్రింక్‌ షోలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ఉత్తమ ఆవిష్కరణల్లో భాగంగా ఈ గ్రీన్‌మచా బ్రెడ్‌ బెస్ట్‌ లోఫ్‌ ప్రథమ బహుమతిని గెలుచుకుంది. గ్రీన్‌టీలోని పోషక విలువలు, దాని రంగు ఏమాత్రం తగ్గకుండా చేసిన ఈ బ్రెడ్‌ ప్రపంచవ్యాప్తంగా ఆహారప్రియులని ఆకట్టుకుంది. నిజానికి మియో తయారుచేసిన ఈ బ్రెడ్‌కి ఇదేం తొలి అవార్డు కాదు. గతంలోనూ ప్రపంచ ఉత్తమ బ్రెడ్‌గా మూడు స్వర్ణాలు గెలుచుకుంది. మియో జపాన్‌కి చెందిన గృహిణి. మా జపాన్‌లో బిస్కెట్లు, కేకుల్లో కూడా ఈ గ్రీన్‌టీని వాడుతుంటాం. అందులో భాగంగానే ఈ బ్రెడ్‌ని తయారుచేశా. కానీ ఈ ఏడాది ఉత్తమ ఆవిష్కరణగా నిలుస్తుందని అనుకోలేదు అనే మియా చేసిన ఈ మచా బ్రెడ్‌కి బ్రిటన్‌లో ఇప్పుడు ఎక్కడలేని డిమాండూ పెరిగిందట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని