కుల్ఫీ బంగారమాయెరా!

భారతీయ మిఠాయిల్లో కుల్ఫీది ఓ ప్రత్యేక స్థానం. మామిడి, పిస్తా, బాదం...వంటి రకాల గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ, గోల్డ్‌ కుల్ఫీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఇందౌర్‌లోని ప్రకాశ్‌ కుల్ఫీ దుకాణంలో చాలా ఫేమస్‌.

Published : 09 Jul 2023 00:19 IST

భారతీయ మిఠాయిల్లో కుల్ఫీది ఓ ప్రత్యేక స్థానం. మామిడి, పిస్తా, బాదం...వంటి రకాల గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ, గోల్డ్‌ కుల్ఫీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఇందౌర్‌లోని ప్రకాశ్‌ కుల్ఫీ దుకాణంలో చాలా ఫేమస్‌. 24 క్యారెట్ల బంగారు రేకుపై అద్ది ఇచ్చే దీని ధర రూ.351. దీంతో పాటు రెండు కేజీలకు పైగా బరువుండే గొలుసులూ, చేతి కడియాలు, ఉంగరాలను ధరించి ఈ షాప్‌ యజమాని బంటీ యాదవ్‌   వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నారు. దాంతో ఈ కుల్ఫీని ఆయన చేతుల మీదుగా అందుకుంటూ సెల్ఫీ తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. రేటు కాస్త ఎక్కువే అయినా...రుచి కూడా సూపర్‌ అంటూ కుల్ఫీ ప్రియులు ఇక్కడ క్యూ కడుతున్నారు. అటెళ్లిన్నప్పుడు మీరూ ప్రయత్నిస్తారా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని