బ్రెడ్డు సోయగం

ఒకప్పుడు జ్వరమొస్తేనే బ్రెడ్డు తినేవాళ్లం. ఇప్పుడలా కాదు.. ఇడ్లీ పిండి సిద్ధంగా లేదంటే అదే మనకి బ్రేక్‌ఫాస్ట్‌. పోషకాహారమే కనుక నెలలో ఎన్నిసార్లు తిన్నా పేచీ లేదు.

Published : 16 Jul 2023 00:19 IST

చిత్రంగా...

ఒకప్పుడు జ్వరమొస్తేనే బ్రెడ్డు తినేవాళ్లం. ఇప్పుడలా కాదు.. ఇడ్లీ పిండి సిద్ధంగా లేదంటే అదే మనకి బ్రేక్‌ఫాస్ట్‌. పోషకాహారమే కనుక నెలలో ఎన్నిసార్లు తిన్నా పేచీ లేదు. బ్రెడ్డుతో టోస్టు, శాండ్‌విచ్‌ తేలిగ్గా చేసుకోవచ్చు. అలా కూడా వద్దనుకుంటే క్రీమో, జామో అద్దుకుని క్షణాల్లో ఆరగించవచ్చు. అయితే పిల్లలతో తినిపించాలంటే మట్టుకు బ్రెడ్డు ముక్కలకు కాసిన్ని సింగారాలు చేయాల్సిందే! కళా హృదయం ఉండాలే కానీ అదేమంత కష్టమైన విషయం కాదు. అనేక రుచులూ రంగుల్లో రకరకాల జామ్స్‌ మనకెటూ అందుబాటులోనే ఉంటాయి. వాటితో రంగులద్ది, ద్రాక్ష, అరటి, యాపిల్‌, చెర్రీ, కీరాదోస ముక్కలు, దానిమ్మ గింజలు మొదలైనవి అలంకరించారంటే.. ఆహా అంటూ అడిగి మరీ తినేస్తారు పిల్లలు. మీరూ ప్రయత్నించి చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు