జర్మన్‌ చాక్లెట్‌కేక్‌ టెక్సాస్‌లో తయారైంది!

పుట్టినరోజు, పెళ్లిరోజు, కొత్త సంవత్సరం, వీడ్కోలు సమావేశం.. మరేదో పండుగ, ఇంకేదో వేడుక.. ఎందులోనైనా కేకు ఉండాల్సిందే, కేక పెట్టించాల్సిందే కదూ!

Updated : 23 Jul 2023 02:13 IST

పుట్టినరోజు, పెళ్లిరోజు, కొత్త సంవత్సరం, వీడ్కోలు సమావేశం.. మరేదో పండుగ, ఇంకేదో వేడుక.. ఎందులోనైనా కేకు ఉండాల్సిందే, కేక పెట్టించాల్సిందే కదూ! నిజం మాట్లాడితే కేకు తినడానికి ప్రత్యేక సందర్భాలు అవసరం లేదు కూడా. అది ఉంటే చాలు పండుగ వాతావరణం దానంతట అదే వచ్చేస్తుంది. ముఖ్యంగా జర్మన్‌ చాక్లెట్‌ కేక్‌ను తలచుకుంటే పిల్లల కళ్లు వెలిగిపోతాయి. సాధారణ స్వీట్ల కంటే కేకును అంతగా ఇష్టపడతారు. ఇంతకీ జర్మన్‌ చాక్లెట్‌ కేకు జర్మనీలో కానీ యూరప్‌ దేశాల్లో కానీ ఆవిర్భవించలేదు. 18వ శతాబ్దం ఆరంభంలో టెక్సాస్‌లో ఒక అమెరికన్‌ తయారుచేశాడు. చాన్నాళ్ల తర్వాత 1852లో జర్మనీకి చెందిన శామ్యూల్‌ అనే వ్యక్తి బేకర్స్‌ చాక్లెట్‌ కంపెనీ కోసం డార్క్‌ చాక్లెట్‌ బార్‌ ఫార్ములా రూపొందించడంతో దానికి ‘జర్మన్‌ చాక్లెట్‌ కేక్‌’ అనే పేరు స్థిరపడింది. అంటే తర్వాత ఎన్ని మార్పులూ చేర్పులూ చోటుచేసుకున్నప్పటికీ అసలు కితాబు మాత్రం అమెరికాకే దక్కుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని