వింత ఐస్‌క్రీం

చల్లచల్లటి, తియ్యతియ్యటి ఐస్‌క్రీం మండు టెండల్లోనే కాదు.. ఏ కాలంలోనైనా నచ్చే స్తుంది. నాలుక జివ్వుమన్నా సరే.. అదో దివ్య రుచి, రమ్యమైన అనుభూతి.

Updated : 23 Jul 2023 02:18 IST

చల్లచల్లటి, తియ్యతియ్యటి ఐస్‌క్రీం మండు టెండల్లోనే కాదు.. ఏ కాలంలోనైనా నచ్చే స్తుంది. నాలుక జివ్వుమన్నా సరే.. అదో దివ్య రుచి, రమ్యమైన అనుభూతి. ఆ కాసేపూ కాశ్మీరు లోయల్లోనో, మంచు పర్వతాల మీదో ఉన్న మధుర భావన. మ్యాంగో, స్ట్రాబెర్రీ, పైనాపిల్‌, యాపిల్‌, జామ, ద్రాక్ష.. ఇలా అసంఖ్యాక ఐస్‌క్రీం రుచులకు ఫిదా అవుతుంటాం. ఎప్పుడూ పాతవాటిని అనుసరించడమేనా.. కొత్త రుచిని అన్వేషిద్దాం అనుకున్నాడో వ్యక్తి. అందుకోసం చాలా ఆలోచించాడు కూడా. ఇక ఎవరికీ ఎట్టి పరిస్థితిలో ఊహకు రాని వింత ప్రయోగం చేశాడు. ఐస్‌క్రీంకు పండ్లు వద్దులెమ్మ నుకుని టొమాటోలో, దోసకాయలో, తోటకూరో, పాలకూరో లాంటి కాయగూరలు ఉపయోగించాడు కాబోలు అనుకుంటున్నారా! ఉహూ.. అంతకంటే రెండడుగులు ముందుకేసి ఐస్‌క్రీం ఘాటుగా ఉండాలనుకుని ఏకంగా మిరపకాయలను ఎంచు కున్నాడు. ఇది అతిశయం కాదు. ఇందౌర్‌కు చెందిన హరి అనే ఫుడ్‌ వెండర్‌ చల్లదనానికి కారం జోడిస్తే బాగుంటుందని పచ్చిమిర్చితో స్పైసీ ఐస్‌క్రీం తయారుచేశాడు. వింటేనే గమ్మత్తుగా ఉంది కదూ! మీకూ రుచి చూడాలనిపిస్తే ఒకసారి ఇందౌర్‌ వెళ్లి రండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని