కొత్త సంవత్సరంలో...

కావల్సినవి: బటర్‌- అరకప్పు, మైదా- కప్పు, పంచదార- కప్పులో మూడోవంతు, హార్లిక్స్‌- ఐదుచెంచాలు.

Updated : 09 Dec 2022 15:05 IST

 

హార్లిక్స్‌ కుకీస్‌

కావల్సినవి: బటర్‌- అరకప్పు, మైదా- కప్పు, పంచదార- కప్పులో మూడోవంతు, హార్లిక్స్‌- ఐదుచెంచాలు.
తయారి: అవెన్‌ని ముందుగానే 165 డిగ్రీల దగ్గర వేడిచేసుకోవాలి. ఒక పాత్రలో బటర్‌, పంచదార ఒకదానితో ఒకటి కలిసేటట్టుగా చెక్క గరిటెతో కలియతిప్పుకోవాలి. దీనిలో హార్లిక్స్‌, మైదా కూడా వేసి అన్నింటినీ కలపాలి. మెత్తని పిండిలా తయారవుతుంది. చిన్నచిన్న ఉండల్లా చేసుకుని ఫోర్క్‌తో ఒత్తితే గీతల్లా వస్తాయి. వీటినే అవెన్‌లో ఉంచి పావుగంటపాటు బేక్‌ చేసుకుంటే సరిపోతుంది.

లైమ్‌ సిరప్‌ కేక్‌

కావల్సినవి: మైదా- 200గ్రా, బేకింగ్‌సోడా- చెంచా, బాదంపొడి- 100గ్రా, పంచదారపొడి- కప్పున్నర, బటర్‌- రెండు చెంచాలు, గుడ్లు- రెండు, పాలు- అరకప్పు, కివిపండ్ల తురుము- నాలుగు చెంచాలు(అనాస లేదా స్ట్రాబెర్రీలని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు), నిమ్మ రసం- అరకప్పు తీసిపెట్టుకోవాలి), నిమ్మ చెక్కపైన పొట్టు సన్నగా తరిగి ఉంచాలి.
తయారి: ముందుగా అవెన్‌ని 180 డిగ్రీల దగ్గర వేడి చేసుకుని... కప్‌కేకులు తయారుచేసుకునే పాన్‌కి నెయ్యి రాసి ఉంచుకోవాలి. ఒక పాత్రలో సగం చక్కెరపొడి, బాదంపొడి, మైదా వేసి కలుపుకోవాలి. మరో పాత్రలో గుడ్లు, బటర్‌, పాలు కలిపి ఇందులో ముందే కలిపి ఉంచిన పిండి, పండ్ల తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కప్‌కేకుల పాన్‌లో నింపి ఇరవైనిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. ఇప్పుడు... నిమ్మచెక్కు, నిమ్మరసం, పంచదార ఒక పాత్రలో వేసి పాకం పట్టుకుని చల్లారనివ్వాలి. టూత్‌పిక్‌తో కప్‌కేకులపై రంధ్రాలు చేసుకుని సిరప్‌ని వేసుకోవాలి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని