పిందెల పచ్చడి!

తెలుగువాళ్లు ఆవకాయ అంటే ప్రాణం పెడతారు. మరి తమిళ ప్రజలు? వాళ్లకి మామిడి పిందెలతో పెట్టే వడు మాంగాయ్‌ అంటే మహా ఇష్టం...

Published : 23 Apr 2023 00:28 IST

తెలుగువాళ్లు ఆవకాయ అంటే ప్రాణం పెడతారు. మరి తమిళ ప్రజలు? వాళ్లకి మామిడి పిందెలతో పెట్టే వడు మాంగాయ్‌ అంటే మహా ఇష్టం...

కాయలతో కాకుండా లేత పిందెలతో పెట్టే వడుమాంగాయ్‌కి లేదా పిందెల ఊరగాయకి అక్కడ చాలా డిమాండ్‌ ఉంది. అందుకే వేసవి రాగానే మైలాపూర్‌, మాదవరం కూరగాయల మార్కెట్లు ఈ మామిడి పిందెలతో నిండిపోతాయి. ఈ పిందెల్లో కూడా రెండు రకాలుంటాయి. ‘కాంబు వడు...’ ఇది మొదటిరకం. కాడలతో జాగ్రత్తగా కోసి దెబ్బ తగలకుండా సేకరించిన కాయలు. రెండో రకం ఏదైనా గాలివాన వస్తే రాలిపోయి దొరికే ‘పొరుక్కు వడు.’ ఏరుకొచ్చిన కాయలన్నమాట. వడుమాగాయ్‌ రుచి తెలిసిన వాళ్లు మొదటిరకాన్నే తింటారు. చాలా ఇళ్లలో ఈ ఊరగాయ పెట్టడం ఓ పెద్ద యజ్ఞంలా చేస్తారు. ఆడపిల్లకు సారెలో ఇవ్వడం, కొత్త అల్లుడికి వడ్డించడం చేస్తారు కాబట్టి మనం ఆవకాయ పెట్టినంత నిష్టగా పెడతారు. ఈ కాయల్ని మళ్లీ కొయ్యరు. అలానే కాయ పళంగా పెట్టేస్తారు. రుచి చాలా బాగుంటుంది. పెట్టుకోవడం కష్టం అనుకొనేవారికి మార్కెట్లో ఈ పచ్చడి రెడీమేడ్‌గా దొరుకుతోంది. పెరుగన్నంలోకి చాలా బాగుంటుందట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని