పర్యావరణ హితం.. రకుల్‌-జాకీ వివాహం

ప్రేమలో పడటం.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం... చాలామంది సినిమా తారలకు కామన్‌.  పెళ్లిని ఓ మధుర జ్ఞాపకంగా మలచుకోవడానికి అంగరంగవైభవంగా వేడుక చేసుకుంటారు కొందరు.

Updated : 24 Feb 2024 11:13 IST

ప్రేమలో పడటం.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం... చాలామంది సినిమా తారలకు కామన్‌.  పెళ్లిని ఓ మధుర జ్ఞాపకంగా మలచుకోవడానికి అంగరంగవైభవంగా వేడుక చేసుకుంటారు కొందరు. మన రకుల్‌ప్రీత్‌ సింగ్‌.. జాకీ భగ్నానీని పెళ్లాడుతున్నప్పుడు పర్యావరణంపై ఉన్న ప్రేమనూ జోడించింది. ఇంతకీ తనేం చేసిందంటే..

  • ఎంత గొప్పగా ఉన్నా.. సాధారణంగా పెళ్లిపత్రికలు కాగితం తోనే తయారు చేస్తారు కదా! అలా చేయడం చెట్లను నరికేయడానికి ఎంతో కొంత కారణం అవుతామని భావించి, కాగితం పెళ్లి పత్రికలు కాకుండా.. ఆహ్వానాలన్నీ డిజిటల్‌మయం చేసిందీ జంట. పైగా ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మొక్కలు నాటించారు.
  • తారల పెళ్లికి భారీగా బాణాసంచా కాల్చుతుంటారు. ఇది కాలుష్యానికి కారణమవుతుంది. అందుకే ఇలాంటి కార్యక్రమాన్ని దూరం పెట్టేశారు.
  • మొదట్లో పెళ్లిని దుబాయ్‌ లేదా అబుదాబిలో నిర్వహించాలని భావించారు. అయితే ప్రధాని మోదీ ‘ధనవంతులు, సమాజంపై ప్రభావం చూపే తారలు.. మనదేశంలోని అందమైన ప్రదేశాల్లోనే పెళ్లి వేడుకలు చేసుకొని అంతర్జాతీయంగా ప్రాచుర్యం తేవాల’ని కోరడంతో వేడుకని గోవాకి మార్చారు.
  • చక్కెర, గ్లూటెన్‌లు అనేక అనారోగ్యాలకు కారణమవుతుంటాయి. తమ పెళ్లిలో వీటిని పూర్తిగా పరిహరించారు రకుల్‌-జాకీలు. అతిథులకు ఎన్నోరకాల వంటకాలు వడ్డించినా.. ఆ రెండు పదార్థాలు లేకుండా మెనూ రూపొందించారు.  
  • అనవసర ఖర్చు.. ఆడంబరాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు, అతి సన్నిహితుల సమక్షంలోనే ఒక్కటయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని