Andhra News: ఇలాగైతే.. సీఎం పర్యటనలకు వాహనాలు సమకూర్చలేం: రవాణా శాఖ లేఖ

సీఎం, వీఐపీల కాన్వాయ్‌ల బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వానికి రవాణాశాఖ లేఖ రాసింది. మూడేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలు రూ.17.5 కోట్లు వెంటనే చెల్లించాలని..

Published : 12 May 2022 14:18 IST

అమరావతి: సీఎం, వీఐపీల కాన్వాయ్‌ల బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వానికి రవాణాశాఖ లేఖ రాసింది. మూడేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలు రూ.17.5 కోట్లు వెంటనే చెల్లించాలని.. లేని పక్షంలో సీఎం, ఇతర ముఖ్య నేతల జిల్లాల పర్యటనలకు వాహనాలు సమకూర్చలేమని లేఖలో రవాణా శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఇటీవల రవాణా శాఖ నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు ఈ అంశాన్ని ఆ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఒంగోలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బకాయిలు తీర్చాలని అధికారులు విన్నవించారు. సీఎం జిల్లాల పర్యటనలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో కాన్వాయ్‌లోని వాహనాల ఏర్పాటు కోసం తక్షణం బిల్లులు చెల్లించాలని కోరారు. వీఐపీల కాన్వాయ్‌ల కోసం ఏటా కనీసం రూ. 4.5కోట్లు అవసరమని రవాణా అధికారులు లెక్క వేశారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయించి, ప్రత్యేక ఖాతా ద్వారా వాహనాల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో రవాణా శాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని