Ap News: సీబీఎస్‌ఈ ప్రమాణాలకు అనుగణంగా పాఠ్యాంశాల మార్పు: సురేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాల్లో మార్పులు చేసే యోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సీబీఎస్‌ఈ ప్రమాణాలకు అనుగుణంగా

Updated : 21 Oct 2021 17:52 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాల్లో మార్పులు చేసే యోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సీబీఎస్‌ఈ ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించనున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాల మార్పుపై 130 మంది ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. పాఠ్యాంశాల రూపకల్పనపై ఉపాధ్యాయులకు సూచనలు చేశామన్నారు. ప్రభుత్వ భావజాలం, సీఎం జగన్‌ ఆలోచనా విధానం ప్రతిబింబించేలా పాఠాలు ఉంటాయన్నారు. అమ్మ ఒడి పథకంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చునని.. అధికారంలోకి రాగానే విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని సురేశ్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని