కొత్తగా 12,926 మందికి కరోనా

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకు 29.53 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 43,763 నమూనాలను పరీక్షించగా.. 12,926 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖపట్నంలో 1,959 కేసులు,

Published : 23 Jan 2022 03:54 IST

క్రియాశీల కేసులు 73,143కు చేరిక

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకు 29.53 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 43,763 నమూనాలను పరీక్షించగా.. 12,926 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖపట్నంలో 1,959 కేసులు, అత్యల్పంగా కృష్ణాలో 354 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 1959, చిత్తూరులో 1566, అనంతపురం 1379, గుంటూరు 1212, ప్రకాశం 1001, కర్నూలులో 969 మందికి పాజిటివ్‌గా తేలింది. విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు కొవిడ్‌తో మరణించారు. 24గంటల్లో 3912 మంది కరోనా నుంచి కోలుకున్నారు. క్రియాశీల కేసులు 73,143 ఉన్నాయి.

తిరుపతి ఐఐటీలో కొవిడ్‌ కలకలం  

చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీలో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి పరీక్షలు చేయగా 70 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. క్యాంపస్‌లోనే హోం  ఐసొలేషన్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు.

* మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

* మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ కరోనా బారినపడ్డారు. దేవేగౌడ దంపతులు గతంలో రెండుసార్లు కరోనా బారినపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని సీఎం  బసవరాజ బొమ్మై ఫోన్లో తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని