రాష్ట్రంలో దోపిడీదారుల పాలన

రాష్ట్రంలో దోపిడీదారుల పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కర్నూలు జిల్లా బనగానపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైకాపా నాయకులు

Published : 20 Jan 2022 05:19 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శ

బనగానపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో దోపిడీదారుల పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కర్నూలు జిల్లా బనగానపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైకాపా నాయకులు పేదలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ అమలుచేసే పథకాలను రాష్ట్రం అమలు చేస్తున్నట్లు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మద్య నిషేధం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ మద్యం దుకాణాల సమయం మరో గంట పొడిగించి పేదలను దోచుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. మద్యం తయారీ పరిశ్రమలను ఆ పార్టీ నాయకులు లీజుకు తీసుకుని ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంగన్‌వాడీ, పాఠశాలలకు కోడిగుడ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని