కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవాలి

ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు నెలలోగా ప్రభుత్వం పరిహారం అందించకుంటే తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నేరుగా క్షేత్ర స్థాయికి వెళ్లి పోరాడతారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌ నాదెండ్ల

Published : 01 Apr 2022 04:42 IST

పరిహారం అందించకుంటే పోరాటం
జనసేన పీఏసీ ఛైర్మన్‌ మనోహర్‌

రాజమహేంద్రవరం (కంబాలచెరువు), న్యూస్‌టుడే: ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు నెలలోగా ప్రభుత్వం పరిహారం అందించకుంటే తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నేరుగా క్షేత్ర స్థాయికి వెళ్లి పోరాడతారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం కౌలు రైతులను ఇబ్బందిపెట్టేలా 11 నెలల రెంటల్‌ అగ్రిమెంటును చట్టంలో చేర్చిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కౌలు రైతులు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. 2, 3 నెలలుగా ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా రామచంద్రపురం, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు రెవెన్యూ డివిజన్లలోని సుమారు 18 గ్రామాల నుంచి క్షేత్ర స్థాయి వాస్తవాలను సేకరించామని వివరించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారిలో ధైర్యం నింపామని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంలో 2019లో 1019 మంది, 2020లో 889 మంది రైతులు చనిపోయారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని