
Train: 19 నుంచి డెము, మెము రైళ్లు
విడతల వారీగా 82 ట్రైన్లు అందుబాటులోకి
ఈనాడు, హైదరాబాద్: దగ్గరి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు శుభవార్త. పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 19 నుంచి కొన్ని... 20, 21 తేదీల నుంచి మరికొన్ని ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కరోనా నేపథ్యంలో 2020 మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు ఈ రైళ్లు రద్దయ్యాయి. గతంలో తిరిగే రైళ్ల స్థానే అదే మార్గంలో కొత్త నంబర్లతో ప్రత్యేక రైళ్లుగా ద.మ.రైల్వే పట్టాలు ఎక్కిస్తోంది. మొత్తం 82 రైళ్లను నడపనుండగా అందులో 66 ప్యాసింజర్లు కాగా, 16 ఎక్స్‌ప్రెస్‌లు. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలుచేస్తామని.. ప్రయాణికులు సురక్షిత దూరం పాటించాలని ద.మ.రైల్వే జీఎం గజానన్ మల్య స్పష్టంచేశారు. ప్రయాణ సమయం మొత్తంలో మాస్క్‌లు ధరించాల్సిందేనని అన్నారు. అందుబాటులోకి రానున్నవాటిలో.. కాజీపేట-సిర్పూర్‌టౌన్, వాడి-కాచిగూడ, డోర్నకల్-కాజీపేట, కాచిగూడ-మహబూబ్‌నగర్, కాచిగూడ-కరీంనగర్, సికింద్రాబాద్-కళబురిగి, కరీంనగర్-పెద్దపల్లి, విజయవాడ-డోర్నకల్, విజయవాడ-గూడూరు, కాకినాడపోర్ట్-విజయవాడ, నర్సాపూర్-గుంటూరు, రాజమండ్రి-విజయవాడ, విజయవాడ-మచిలీపట్నం, రేణిగుంట-గుంతకల్, వరంగల్-సికింద్రాబాద్, గుంటూరు-విజయవాడ తదితర రైళ్లున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- మొత్తం మారిపోయింది
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Maharashtra: ఉద్ధవ్ వైపే ఉంటానని కన్నీరు పెట్టుకొని.. శిందేకు ఓటేశారు!