బడి బాటలో ముళ్లు, నీళ్లు!

చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం సీగొల్లపల్లె పంచాయతీ ఇంగంవారిపల్లెకు చెందిన విద్యార్థులు ప్రమాదకరంగా ఏరు దాటి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ గ్రామంలో గతంలో పాఠశాల ఉండేది. ఇక్కడ

Published : 29 Nov 2021 03:56 IST

చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం సీగొల్లపల్లె పంచాయతీ ఇంగంవారిపల్లెకు చెందిన విద్యార్థులు ప్రమాదకరంగా ఏరు దాటి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ గ్రామంలో గతంలో పాఠశాల ఉండేది. ఇక్కడ బడిని ఎత్తేయడంతో 32 మంది విద్యార్థులు కిలోమీటరు దూరంలోని దొమ్మరపల్లె బడికి వెళ్తున్నారు. వీరెళ్లే మార్గంలో వాగు, ఏరు దాటాల్సి వస్తోంది. వర్షాలకు ఏరులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. చిన్న పిల్లలు లోతు తక్కువ ఉన్న చోట పాకుడు పట్టిన బండల మీదుగా అత్యంత ప్రమాదకరంగా ఏరు దాటుతున్నారు. కనీసం దారి కూడా సక్రమంగా లేదు. వంతెన నిర్మించి దారి చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, పెద్దమండ్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని