ఎమ్మార్‌ కేసులోనిందితులకువారంట్లు

ఎమ్మార్‌ కేసులో నిందితులైన కోనేరు ప్రదీప్‌, విజయరాఘవ్‌, శ్రీకాంత్‌ జోషిలకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు బుధవారం నాన్‌ బెయిలబుల్‌ వారంట్లు జారీచేసింది. సీబీఐతోపాటు ఈడీ కేసుల్లో విజయ్‌రాఘవ్‌, శ్రీకాంత్‌

Published : 02 Dec 2021 04:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితులైన కోనేరు ప్రదీప్‌, విజయరాఘవ్‌, శ్రీకాంత్‌ జోషిలకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు బుధవారం నాన్‌ బెయిలబుల్‌ వారంట్లు జారీచేసింది. సీబీఐతోపాటు ఈడీ కేసుల్లో విజయ్‌రాఘవ్‌, శ్రీకాంత్‌ జోషి, వారి తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో వారంట్లు జారీచేసింది. ఈడీ కేసులో కోనేరు ప్రదీప్‌ తరఫున న్యాయవాది హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసినా, సంతకం చేయకపోవడంతో కోర్టు వారంటు జారీచేసింది. ఈ నెల 8న నిందితులను హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఓబుళాపురం మైనింగ్‌ కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మి డిశ్ఛార్జి పిటిషన్‌లో వాదనలు పూర్తికాగా సీబీఐ వాదనల నిమిత్తం ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో పెన్నా సిమెంట్స్‌ కేసులో నిందితుల జాబితాలో ఉన్న కార్మెల్‌ ఏషియా లిమిటెడ్‌ డిశ్ఛార్జి పిటిషన్‌పై విచారణ జరిగింది. అనంతపురం జిల్లా యాడికి మండలంలో పెన్నా సిమెంట్స్‌కు 231 ఎకరాల కేటాయింపు నిబంధనల ప్రకారమే జరిగిందని కార్మెల్‌ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి అన్నారు. తాడిపత్రిలో ఇలాగే చేసిన భూకేటాయింపులో అక్రమాలు లేవన్న సీబీఐ.. ఇక్కడ మాత్రం భిన్నంగా చెబుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని