
TTD: అమెజాన్‌లో తితిదే డైరీలు, క్యాలెండర్లు
తిరుమల, న్యూస్‌టుడే: తితిదే రూపొందించిన 2022 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను తితిదే వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ఆన్‌లైన్ సర్వీసెస్ నుంచీ పొందొచ్చు. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ‘పబ్లికేషన్స్’పై క్లిక్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. బుక్ చేసుకున్న వారికి తపాలా ద్వారా పంపుతారు. విదేశాల్లోని భక్తులకూ తపాలా ద్వారా అందించేలా తితిదే ఏర్పాట్లు చేపట్టింది. తితిదే క్యాలెండర్లు, డైరీలను పోస్టు ద్వారా పొందొచ్చు. ఇందుకు ‘కార్యనిర్వహణాధికారి, తితిదే, తిరుపతి’ పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి కవరింగ్ లెటర్‌తో కలిపి ‘ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కేటీ రోడ్, తిరుపతి’ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. మరింత సమాచారానికి ప్రచురణల విభాగం, అధికారిని ఫోన్‌లో (0877-2264209, 99639 55585) సంప్రదించొచ్చు. తిరుమల, తిరుపతిలోని తితిదే పుస్తక విక్రయశాలలు.. విజయవాడ, విశాఖ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూదిల్లీ, ముంబయిలోని తితిదే సమాచార కేంద్రాలు, తితిదే కల్యాణ మండపాలు, అనుబంధ ఆలయాల్లోనూ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉంచారు.