జూన్‌ 30లోపు కారుణ్య నియామకాలు పూర్తి

కొవిడ్‌తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద జూన్‌ 30లోగా ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 19 Jan 2022 04:47 IST

ఈనాడు, అమరావతి: కొవిడ్‌తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద జూన్‌ 30లోగా ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువ స్థాయి హోదాతో నియామకం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ నియామకాలను 2021 నవంబరు 31లోగా చేపట్టాలని నిర్ణయించినా పెద్ద మొత్తంలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరితగతిన వీటిని పరిష్కరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం ఇవ్వనున్నారు. దరఖాస్తులు పరిశీలించి, తక్షణం ఖాళీలను భర్తీ చేయాలని కలెక్టర్లకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని