నాణ్యమైన విద్యకు ఎంతైనా వెచ్చిస్తాం

నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం ఎంత వెచ్చించడానికైనా సిద్ధంగా ఉందని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్‌ పేర్కొన్నారు. పాఠశాలల మ్యాపింగ్‌, నూతన జాతీయ విద్యా విధానం అమలుపై గుంటూరులో మంగళవారం నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ

Updated : 19 Jan 2022 05:32 IST

పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్‌

ఈనాడు, గుంటూరు: నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం ఎంత వెచ్చించడానికైనా సిద్ధంగా ఉందని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్‌ పేర్కొన్నారు. పాఠశాలల మ్యాపింగ్‌, నూతన జాతీయ విద్యా విధానం అమలుపై గుంటూరులో మంగళవారం నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఏపీలో అమలు చేస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడానికి క్యాబినెట్‌లో నిర్ణయించడం శుభపరిణామమన్నారు. ‘పాఠశాలల విలీనం ప్రక్రియను వ్యతిరేకిస్తూ కొందరు విమర్శిస్తున్నారు. వారు తాము తొలుత ప్రభుత్వ ఉద్యోగులం అనే విషయాన్ని మరవకూడదు. ఇక మీదట ఇలాంటివి సాగబోవు...’ అని స్పష్టం చేశారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నారని గుర్తు చేశారు. విలీనంతో పిల్లలు పెరిగి అదనపు గదులు, కొత్త టీచర్ల నియామకాల అవసరం ఏర్పడినా వాటిని పరిష్కరించడానికి సీఎం జగన్‌ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. అలాగే పాఠశాలలు దూరమైతే పిల్లలకు రవాణా వసతి కల్పించడానికి సమగ్రశిక్షలో అనేక పథకాలు ఉన్నాయన్నారు. కమిషనర్‌ సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ నెల 21 నాటికి ఈ ప్రక్రియను ముగించాలన్నారు. డీఈఓలు, ఆర్జేడీలు, అడిషనల్‌ డైరెక్టర్లు, డీవైఈఓలు, ఏడీలు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని