జైల్లో తినాలనుందా..?

ఏదైనా చేయకూడని పని చేస్తే ‘చిప్పకూడు తినాలని ఉందా’ అంటారు. అంటే, జైల్లో పెట్టే భోజనమని అర్థం. కానీ... అసలు జైలు అంటే ఎలా ఉంటుంది, ఆ వాతావరణంలో కాసేపు గడిపి, అక్కడే భోజనం చేస్తే బాగుంటుందని అనుకునే వాళ్లూ లేకపోలేరు. అలాంటి

Published : 19 Jan 2022 04:47 IST

దైనా చేయకూడని పని చేస్తే ‘చిప్పకూడు తినాలని ఉందా’ అంటారు. అంటే, జైల్లో పెట్టే భోజనమని అర్థం. కానీ... అసలు జైలు అంటే ఎలా ఉంటుంది, ఆ వాతావరణంలో కాసేపు గడిపి, అక్కడే భోజనం చేస్తే బాగుంటుందని అనుకునే వాళ్లూ లేకపోలేరు. అలాంటి వాళ్ల సరదా తీర్చడానికే తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ‘ఖైదీ’ అనే పేరుతో ఓ రెస్టారెంట్‌ ఏర్పాటుచేశారు. అక్కడికి వెళ్లిన వినియోగదారులకు ఖైదీ దుస్తుల్లో ఉన్న సిబ్బంది సేవలందిస్తారు. ఖైదీల్లాగే సెల్‌లో కూర్చొని తమకు ఇష్టమైన రుచులను ఆరగించొచ్చు. హోటల్‌లో కొవిడ్‌ నిబంధనల మేరకు 14 బ్యారక్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో సెల్‌లో ఆరుగురు కుటుంబసభ్యులు కూర్చునేలా.. పెద్ద కుటుంబమైతే 20 మంది కూర్చొనేల ప్రత్యేక బ్యారక్‌ ఏర్పాటుచేశారు. బిల్లు ‘వకీల్‌సాబ్‌’కు చెల్లిస్తే బెయిలు మంజూరై వినియోగదారులు బయటకు వెళ్లొచ్చు.

- న్యూస్‌టుడే, కాకినాడ (గాంధీనగర్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని