సినిమా టికెట్‌ ధరలపై వ్యాజ్యం

సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు లోగడ ఇచ్చిన ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతున్నారంటూ న్యాయవాది జీఎల్‌ నరసింహారావు హైకోర్టులో వ్యాజ్యం వేసి నేరుగా వాదనలు వినిపించారు. ఎప్పటినుంచో

Published : 20 Jan 2022 05:33 IST

రాష్ట్ర ప్రభుత్వం, దగ్గుబాటి సురేష్‌బాబుకు నోటీసులు

సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు లోగడ ఇచ్చిన ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతున్నారంటూ న్యాయవాది జీఎల్‌ నరసింహారావు హైకోర్టులో వ్యాజ్యం వేసి నేరుగా వాదనలు వినిపించారు. ఎప్పటినుంచో జరుగుతున్న టికెట్‌ అధిక ధరల విక్రయం వెనక రూ.2లక్షల కోట్ల కుంభకోణం ఉందని వివరించారు. ధరలను నిర్ణయిస్తూ గతేడాది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో35ను రద్దు చేయాలని కోరారు. సినీ ఎగ్జిబిటర్‌, డిస్ట్రిబ్యూటర్‌ దగ్గుబాటి సురేష్‌బాబుకు చెందిన సినిమా థియేటర్‌ యజమానులు పలుమారు హైకోర్టును ఆశ్రయించి న్యాయస్థానం విచారణను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, దగ్గుబాటి సురేష్‌బాబుకు నోటీసులిచ్చింది. అవి అందాక తదుపరి విచారిస్తామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని