నాడు అంగీకరించి.. నేడు ఆందోళనా?: మంత్రి సురేష్‌

ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌తో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీని అంగీకరించారని.. నేడు వారే ఆందోళన చేయడం సరికాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడి వద్దనున్న విజ్ఞాన్‌ డీమ్డ్‌

Published : 21 Jan 2022 05:51 IST

పొన్నూరు, న్యూస్‌టుడే: ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌తో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీని అంగీకరించారని.. నేడు వారే ఆందోళన చేయడం సరికాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడి వద్దనున్న విజ్ఞాన్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీలో గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఇబ్బందులుంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. తీవ్రత అంతగా లేదని అభిప్రాయపడ్డారు. పాఠశాలలకు సెలవులిచ్చే ఆలోచన లేదని స్పష్టంచేశారు. విద్యార్థులకు కరోనా వస్తే సదరు పాఠశాల వరకు మూసేసి శానిటైజ్‌ చేశాక పునఃప్రారంభిస్తామన్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని, న్యాయస్థానం కూడా ఇందుకు అనుమతించిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని