పీఆర్సీ జీవోలపై హైకోర్టు ఉద్యోగుల నిరసన

పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టు ఉద్యోగులు గురువారం భోజన విరామ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి ముక్కున వేలు వేసుకొని వినూత్నంగా నిరసన తెలియజేశారు. ర్యాలీ నిర్వహించి హైకోర్టు వద్ద

Published : 28 Jan 2022 03:03 IST

ఈనాడు, అమరావతి: పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టు ఉద్యోగులు గురువారం భోజన విరామ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి ముక్కున వేలు వేసుకొని వినూత్నంగా నిరసన తెలియజేశారు. ర్యాలీ నిర్వహించి హైకోర్టు వద్ద ఉన్న జాతీయ పతాకానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.వేణుగోపాలరావు మాట్లాడుతూ అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదికను బహిర్గతం చేయకుండా, ఉద్యోగ సంఘాల వినతులను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా పీఆర్సీ జీవోలను విడుదల చేయడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. దీంతో ఉద్యోగులందరూ ముక్కున వేలేసుకున్నారని అన్నారు. ఉద్యోగులతో ముఖ్యమంత్రి నేరుగా చర్చించి అందరికి ఆమోదయోగ్యమైన జీవో విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు సురేంద్రనాథ్‌, సతీష్‌వర్మ, పీరు సాహెబ్‌, కోటేశ్వరరావు, సీతాఫణికుమారి, లక్ష్మీప్రసన్న, వీరాస్వామి, చంద్రబాబు, రాంబాబు, అశోక్‌, రత్నభాస్కర్‌, పిచ్చిరాజు, పలువురు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని