Andhra News: మార్చి 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను వచ్చే నెల 7 నుంచి ప్రారంభించనున్నారు. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా సమావేశాలను

Published : 24 Feb 2022 07:00 IST

11న లేదా 14న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను వచ్చే నెల 7 నుంచి ప్రారంభించనున్నారు. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా సమావేశాలను నిర్వహించవచ్చని అంటున్నారు. మార్చి 7న తొలిరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలియజేయనున్నారు. 8న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తారు. మార్చి 11 లేదా 14న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని